చిన్న ప్రేవులలో జీర్ణం కాగా మిగిలిపోయిన వ్యర్ధపదార్ధాలు కోలన్ (Colony) గా పిలవబడే పెద్ద ప్రేవులలోకి చేరుకుంటాయి. అందులో ఎక్కువభాగం పీచు పదార్థం, మెటబాలిజమ్ ప్రక్రియలో Breakdown. కాగా మిగిలిన వ్యర్థాలు, Fluid ఉంటాయి.
పెద్ద ప్రేవుల గోడలు పైన చెప్పిన వ్యర్ధాలలోంచి నీరు, ఖనిజలవణాలు మొదలైన వాటిని అవసరమైనంత మేర పీల్చేసుకుని రక్త ప్రవాహంలోకి ప్రవేశ పెడతాయి.
ఇంకా మిగిలిపోయిన వ్యర్ధాన్ని పెద్ద ప్రేవుల గోడలు తమ సంకోచ వ్యాకోచాల ద్వారా (దీనిని Peristalsis అంటారు) రెక్టం (Rectum) వేపుకు నెడతాయి.
పెద్ద ప్రేవుల గోడల సంకోచ వ్యాకోచాలు మన శరీరంలోని Auto- nomic nervous system ద్వారా కంట్రోల్ చేయ బడుతుంటాయి.
ఏదన్నా వ్యాధి గాని మందులు గాని Autonomic nervous system bo ప్రతికూల ప్రభావాన్ని చూపినప్పుడు పెద్ద ప్రేవుల గోడల కండరాల సంకోచ వ్యాకోచాలు (Peristalsis) మవుతాయి. ఫలితంగా ఆ మనిషిలో మలబద్ధకం ఏర్పడుతుంది
ఆహారంలో పీచు పదార్థం సరిపడా లేకపోవడం సరిపడా నీరు తాగకపోవడం కూడా మలబద్ధకం ఏర్పడడానికి ముఖ్య కారణంగా పనిచేస్తుంటాయి.
మాంసాహారం
మాంసాహారంలో పీచుపదార్థం ఉండదు. ఈ కారణం వల్ల మాంసా హారాన్ని తీసుకునే వారికి మలబద్ధకం ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలుఉంటాయి.
మాంసాహారంఆహారంలో పాటు పచ్చి కూరగాయలు తినడం సలాడ్స్ తీసుకోవడం లాంటి అలవాటు చేసుకోవడం ద్వారా మాంసాహారులు మలబద్దానికి దూరంగా ఉండ వచ్చు.
రాత్రి డిన్నర్ భోజనము సూర్యుడు అస్తమించిన రెండు గంటల లోపట చేయాలి.7.30-8 గంటలు
లోపల సేవించాలి ఆలస్యంగా భోజనం చేస్తే మలబద్దక సమస్య వస్తది.