మీకోసం న్యూస్ పెనుకొండ , ఆగస్టు 8:
డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో పారదర్శకతకు మద్దతుగా కర్నూలులో శనివారం నిర్వహిస్తున్న టీచర్ల సంఘీభావ ర్యాలీకి పెనుకొండ నియోజకవర్గం నుంచి డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు, ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ప్రత్యేక బస్సులో పెనుకొండ నుంచి కర్నూలుకు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో రాజకీయ జోక్యానికి తావులేకుండా, నియామక ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఉపాధ్యాయుల సమస్యలపై కేవలం రాజకీయ ప్రకటనలు, సానుభూతి చూపడం కాకుండా వాటికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందన్నారు. డీఎస్సీ–2025 నియామకాలపై అనవసర రాజకీయ వివాదాలు సృష్టించడం వల్ల ఎంపికైన ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
టీచర్ల భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని, నియామక ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారిక మార్గాల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. డీఎస్సీ–2025 నియామకాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
న్యాయం, పారదర్శకతకు మద్దతు
డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో ఎంపికైన ఉపాధ్యాయుల భవిష్యత్తుకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించి, అర్హత, మెరిట్ ఆధారంగా ప్రక్రియ కొనసాగాలని కోరారు.
“ఉపాధ్యాయుల భవిష్యత్తు కోసం.. పారదర్శక నియామకాలకు మా సంపూర్ణ మద్దతు” అంటూ నినాదాలు చేస్తూ పెనుకొండ నుంచి కర్నూలులో నిర్వహిస్తున్న సంఘీభావ ర్యాలీకి తరలివెళ్లారు. డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు సంఘీభావం ప్రకటించారు.
2025 మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో 15,941 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
డీఎస్సీ–2025 టీచర్లకు సంఘీభావం.. జై టీచర్స్! అంటూ నినాదాలు చేస్తూ పెనుకొండ నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు కర్నూలు ర్యాలీకి బయలుదేరారు.
0 కామెంట్‌లు