డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాల మహానాడు నాయకులు
అనంతపురం, మీకోసం న్యూస్:
ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ కల్లూరి చెంగయ్య 50వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా నడిబొడ్డున ఉన్న భారత రాజ్యాంగ పితామహుడు, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ కల్లూరి చెంగయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర శాశ్వత ఉపాధ్యక్షులు, ఉరుముల కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి పూలకుంట రాము ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ కల్లూరి చెంగయ్య సామాజిక న్యాయం, దళితుల సంక్షేమం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిగా కొనియాడారు. ఆయన మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సాకే శ్రీదేవి, నాగప్ప, ఉరుముల కళాకారుల సీనియర్ నాయకులు మేడాపురం నరసింహులు, అనంతపురం నగర ఉపాధ్యక్షులు బి. సురేంద్ర, జిల్లా కమిటీ సభ్యుడు సంగా ఓబులేసు, అరవకూరు పెద్దన్నతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ కల్లూరి చెంగయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
0 కామెంట్‌లు