చెన్నేకొత్తపల్లి, ఆగస్టు 11 (మీకోసం న్యూస్): స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టుల భర్తీకి ఈ నెల 13న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ సీడీపీవో కవితాదేవి తెలిపారు.
చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల్లోని ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఇంటర్వ్యూలు ఈ నెల 13న బుధవారం ఉదయం 10 గంటలకు ధర్మవరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో జరుగుతాయని సీడీపీవో కవితాదేవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు సమయంలో సమర్పించిన ధ్రువపత్రాలన్నింటినీ అభ్యర్థులు తప్పనిసరిగా అసలైన ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. నిర్ణీత సమయానికి అభ్యర్థులు కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు.
అంగన్‌వాడీ హెల్పర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీడీపీవో కవితాదేవి కోరారు.
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com

0 కామెంట్‌లు