అంతర్జాతీయ వార్తలు

HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

సోమందేపల్లిలో ఘనంగా వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు

మారుమోగిన దేశభక్తి నినాదాలు

మీకోసం న్యూస్ ,సోమందేపల్లి, సెప్టెంబర్ 25:
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ సర్కిల్‌లో ‘వందేమాతరం’ గేయ రచనకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. సరస్వతి విద్యానికేతన్ పాఠశాల హెచ్ఎం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పలువురు ప్రముఖులు ఏకకంఠంతో వందేమాతరం గేయాన్ని ఆలపించారు. దీంతో ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతం దేశభక్తి నినాదాలతో మారుమోగింది.

కార్యక్రమంలో ఎస్సై సుధాకర్ యాదవ్, బీజేపీ యువ నాయకుడు ఎస్.ఆర్. పార్థసారథిరెడ్డి, విజ్ఞాన్ పాఠశాల హెచ్ఎం మల్లికార్జున, వివేకానంద పాఠశాల హెచ్ఎం వనజ, క్రీస్తుజ్యోతి పాఠశాల ఉపాధ్యాయులు, మాస్టర్ వీవర్ పల్లి భాస్కర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

వందేమాతరం గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక స్ఫూర్తిని అందించిందని వారు పేర్కొన్నారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం స్వదేశీ ఉద్యమం, బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ సమయంలో ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషించిందని తెలిపారు.

1896లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరాన్ని ఆలపించడంతో ఈ గేయం దేశవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది.

150 ఏళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వందేమాతరం గేయం నేటికీ దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
✍️ Editor: Prakash | Meekosam.in
Somandepalli | Sri Sathya Sai District | Contact: meekosamnews2026@gmail.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు