అంతర్జాతీయ వార్తలు

ప్రపంచ వార్తలు తాజా అంతర్జాతీయ వార్తలు చూడండి ↗
వార్తల ఫీడ్ లోడ్ కాకపోతే ఈ లింక్ ద్వారా చూడవచ్చు.
HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

భూ సమస్యల నుంచి పింఛన్ల వరకు.. నేరుగా అధికారుల దృష్టికి

జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుకు కలెక్టర్, జేసీ నిర్ణయం

పుట్టపర్తి,మీకోసం న్యూస్,అక్టోబర్ 08:
శ్రీ సత్యసాయి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను ప్రత్యేకంగా పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మాల మహానాడు నాయకులు జిల్లా అధికారులను కోరారు. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు గౌరవ అధ్యక్షులు చెరుకూరి గంగులయ్య, అధ్యక్షులు ఎం.ఎన్. మూర్తి అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మాల మహానాడు నాయకుల విజ్ఞప్తికి స్పందించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ జిల్లా స్థాయిలో ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

ఎలాంటి సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు?

ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలుగుతుందని మాల మహానాడు నాయకులు తెలిపారు.

భూ సమస్యలు, సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, గృహాలు, పింఛన్లు, ధ్రువపత్రాలు, సామాజిక వివక్ష తదితర అంశాలపై ప్రజలు తమ సమస్యలను అధికారులకు వివరించి పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు శ్రీ సత్యసాయి జిల్లా మాల మహానాడు తరఫున నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షులు కోట్ల మల్లికార్జున, జిల్లా కోశాధికారి కురుగుంట గోవిందు, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ గొల్లపల్లి నాగేంద్ర, పేలుబండ బసవరాజు, గుడిబండ మండల మాల మహానాడు అధ్యక్షులు ఎం.ఆర్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు