మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

12వ పెను‌కొండలో ఉద్యోగ మేళా.. 10 ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు!

పెనుకొండ, నవంబర్ 10: మీకోసం న్యూస్

శ్రీ సత్యసాయి జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన పెనుకొండలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 10 ప్రముఖ జాతీయ కంపెనీల భాగస్వామ్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఉద్యోగ మేళాకు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ సోమవారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ జాబ్ మేళాలో పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, బీటెక్, డిప్లొమా, పీజీ, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు.

18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాకు హాజరుకావచ్చని అధికారులు తెలిపారు.

జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగాలను పొందేందుకు జాబ్ మేళాలో పాల్గొనాలని అధికారులు సూచించారు.

ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీన పెనుకొండలో జరిగే ఉద్యోగ మేళాకు హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు కోరారు.

మీకోసం న్యూస్ ఎడిటర్: ప్రకాష్ సోమందేపల్లి | శ్రీ సత్యసాయి జిల్లా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు