మీకోసం NEWS తేదీ లోడ్ అవుతోంది…|సమయం --:--
హోమ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్ జాతీయం భక్తి సినిమా
తాజా వార్తలు
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

స్థానిక ఎన్నికల్లో అల్లర్లు, ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు!

రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత నేరస్థులకు అడిషనల్ ఎస్పీ అంకిత సురానా కౌన్సెలింగ్

బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు.. తిరిగి జైలుకు పంపిస్తాం

పుట్టపర్తి, మీకోసం న్యూస్, నవంబర్ 13:

శ్రీ సత్యసాయి జిల్లాలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎన్నికల సమయంలో గ్రామాల్లో అల్లర్లు, రాజకీయ ఘర్షణలు, గొడవలకు పాల్పడితే ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని అడిషనల్ ఎస్పీ శ్రీమతి అంకిత సురానా ఐపీఎస్ హెచ్చరించారు.

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు శుక్రవారం ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్, తాడిమర్రి, బత్తలపల్లి పోలీస్ స్టేషన్లను అడిషనల్ ఎస్పీ సందర్శించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్

ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, పాత నేరస్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. రాబోయే స్థానిక ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలు, ఘర్షణలకు పాల్పడకుండా చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రాజకీయ ఘర్షణలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే తిరిగి రిమాండ్!

ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నేరస్థులు కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తే వారి బెయిల్ రద్దుకు చర్యలు తీసుకుని తిరిగి రిమాండ్‌కు పంపిస్తామని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

అదేవిధంగా బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తే పూచీకత్తుగా సమర్పించిన రూ.5 లక్షల మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

పోలీస్ స్టేషన్లలో రికార్డుల పరిశీలన

పోలీస్ స్టేషన్లను సందర్శించిన అడిషనల్ ఎస్పీ అక్కడి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. విధుల నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

నామినేషన్ల కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్ల సమీక్ష

అనంతరం తాడిమర్రి మండలంలోని పెద్దకోట్ల గ్రామంతో పాటు ఎంపీడీవో కార్యాలయం, పంచాయతీ కార్యాలయాలను సందర్శించి నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

నామినేషన్ల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గతంలో మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన తరహాలోనే రాబోయే సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో కదిరి డీఎస్పీలు శివనారాయణ స్వామి, బీవీ జగన్నాథరాజు, సీఐలు రామసుబ్బయ్య, సునీత, ఎస్సైలు కృష్ణవేణి, శేఖర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పోలీసు కార్యాలయం, పుట్టపర్తి.

మీకోసం NEWS మీ మాట | మా వార్త | మీ కోసం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు