కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు.. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
పెనుకొండ – మీకోసం న్యూస్ | ఎడిటర్: ప్రకాష్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీపావళి పర్వదినం సందర్భంగా అమ్మవారిని భక్తితో పూజించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ జిల్లా ప్రజలకు, పెనుకొండ నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

0 కామెంట్లు