మడమ నొప్పి / HEEL PAIN
రోజులో ఎక్కువ సేపు నిలబడే ఉండటం, లేదా సాధారణంగా గట్టి నేల మీద నడక, పరుగు, జాగింగ్ వంటివి దీనికి ముఖ్య కారణం.
మన పాదం అడుగున-మడమ నుంచి వేళ్ల వరకూ ఒక బలిష్టమైన కండరం ఉంటుంది.
దీన్నే ప్లాంటార్ ఫేషియా / PLANTAR FASCIA అంటారు.
పాదం అడుగు వైపున.. ఒక పక్క గొయ్యిలా ఉండే భాగానికి (ఆర్చ్ ) కూడా ఈ దృఢమైన కండరమే ఆధారం._*
గట్టి నేల మీద బలంగా పరుగెత్తటం, ఎక్కువసేపు నిలబడే ఉండటం, ఉన్నట్టుండి బరువు పెరగడం, సరైన పాదరక్షలు వాడకపోవడం..
ఇలా ఏదైనా కారణాన ఈ కండరం మీద తీవ్రమైన ఒత్తిడి పడితే ఇది కొద్దిగా పెరగొచ్చు.
లేదా బాగా నలిగినట్టుగా అవ్వచ్చు.
ఫలితమే- నడిచేటప్పుడు మడమ నొప్పి.
చెప్పుల్లేకుండా నడుస్తున్నా, మెట్లు ఎక్కుతున్నా ఈ నొప్పి ఇంకా పెరుగుతుంటుంది.
సాధారణంగా ఈ నొప్పి పూర్తిగా తగ్గటానికి ఎంతలేదన్నా 2 లేదా 3 నెలలు పడుతుంది.
కొంతమందికి ఇంకా ఎక్కువ సమయమే పట్టొచ్చు కూడా..
మడమ నొప్పి: మడమ నొప్పికి ఈ ఆకుతో ఇలా చేస్తే జన్మలో రాదు..!
HEEL PAIN / మడమ నొప్పి వస్తే ఓ పట్టాన తగ్గదు.
రాత్రి నిద్రపోయి ఉదయం లేవాలంటే మడమ నొప్పి వేధిస్తుంది.
ఈ నొప్పి తగ్గడానికి మార్కెట్లో దొరికే పెయిన్ కిల్లర్స్ ను వాడుతూ ఉంటారు.
వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదు. కొన్ని రోజులకే మళ్లీ సమస్య తిరగబెడుతుంది..!
ఇప్పుడు మనం చెప్పుకోబోయే చిట్కా మడమ నొప్పి సమస్యకి శాశ్వత పరిష్కారం..!
మడమ నొప్పికి ఆయుర్వేద నివారణలు
3 కర్పూరం బిళ్ళలు , 4 వెల్లుల్లి రెబ్బలు, మూడు ఆముదం ఆకులు తీసుకొవాలి. వాటిని మెత్తగా దంచి ముద్ద చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని బాండలీ పెట్టి గోరువెచ్చగా వేడి చేయాలి.
ఈ మిశ్రమం కాస్త వేడిగా ఉన్నప్పుడు మడమ నొప్పి ఉన్న చోట ఈ మిశ్రమాన్ని ఉంచి పైన పలుచటి ప్లాస్టిక్ సింగల్ పొర పేపర్ పెట్టి ఆపై కాటన్ క్లాత్ వేసి కట్టు కట్టాలి.
అరగంట తర్వాత చల్లటి నీటితో కాళ్ళు కడుక్కోవాలి.
ఇలా వరుసగా ఏడు రోజులపాటు చేస్తూ ఉంటే మడమ నొప్పి శాశ్వతంగా తగ్గిపోతుంది.
మడమ నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఉదయం సాయంత్రం రెండు పూటలా కట్టు వేసుకోవచ్చు.
వరుసగా ఏడు రోజుల పాటు ఈ మిశ్రమంతో పట్టి వేసుకుంటే మడమ నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
మళ్లీమళ్లీ ఈ సమస్య మిమ్మల్ని వేధించదు. వివిధ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వేసుకుని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకునే కంటే ఇంట్లో ఉన్న వీటిని ఉపయోగించి మడమ నొప్పి తగ్గించుకోవచ్చు. పైగా పైసా ఖర్చు ఉండదు.