తీపి పదార్థాలు
మన శరీరంలో జీర్ణమైన ఆహారంలోని గ్లూకోజు శరీరానికి కావలసినంత ఉపయోగించి మిగిలిన దానిని భద్రపరచడం క్లోమము అనే అవయవం పని ఇది ఇన్సులిన్ ఉత్పత్తి చేసి ఈ పని చేస్తుంది. అయితే మనం ఎక్కువగా స్వీట్స్ తీసుకుంటూవుంటే అది పనిచేసి కొంతకాలానికి మూలన పడుతుంది. దానితో ఆ ఎక్కువైన షుగరు మూత్రం ద్వారా పోతూ శరీరం అంతా షుగర్ మయం అయ్యి గాయాలు పడితే మాననివ్వకుండా, శరీర బరువు తగ్గి ఎప్పుడు నీరసంగా వుంటే షుగర్ జబ్బు వస్తుంది. కనుక సరిపడినంత తీపినే తినాలిగాని ఎక్కువ తిని అనర్థం తెచ్చుకోవద్దు. ఈ తీపికి కూడా పంచదార కంటే బెల్లం దానికంటే తేనె మంచిది. నిజంగా తేనెలో 70 రకాల ఉపయోగ గుణాలు వుండి మన శరీరానికి ఎంతైనా మేలు చేస్తున్నాయి. అందుకే పరగడుపున గ్లాసు నీళ్ళలో 2 స్పూనులు తేనె, చెక్క నిమ్మరసం కలిపి తీసుకుంటే (మొదటిసారి నీరు త్రాగినతరువాత ఎంతో మంచిది.
పులుపు
ఇది కూడా మన శరీరానికి
చాలా అవసరం ఇది శరీరంలో నిల్వ ఉండ ప్రతిరో తీసుకోవలసి వస్తుంది. అందుకే గర్భిణీ స్త్రీలకు ఈ వులువు శరీరంలో తగ్గి నిపిస్తుంది. అయితే ఈ పులుపుకు చింతపండు కంటే నిమ్మరసం చాలా మంచిది. నిమ్మకాయలలో అత్యధికంగా ప్రాణశక్తి వుండి శరీరంలోని న్వను కరిగించే శక్తి వుంది అరం అరగకుండా మరల ఏదైనా తింటే జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. మనం అన్నం ఉడికిస్తూ వుండగా అయ్యో చుట్టం వచ్చాడు కదా అని ఒక బియ్యం దానిలో పోసినామనుకోండి ఏమి జరుగుతుంది. అది పొట్టలో కూడ జరిగి అనర్థం జరుగుతుంది. ఇలా ఆహారంలో ఉపయోగపడే పదార్థాలను ఎక్కువగా. తీసుకుంటూ మిగిలినవి తగ్గిస్తూ చక్కగా నమిలి తింటే హాయిగా వుండవచ్చు. తినేటప్పుడు ఆ బ్రతికినన్నాళ్ళు బ్రతుకుదాంలే అని అనిపిస్తుంది. ఇబ్బంది కలిగినపుడు ఛా ! అనేది బ్రతుకురా బాబు అనుకుంటూ ఉంటాము. "యథాఅన్నం తథామనః" అందుకే ఆహార ధర్మాన్ని నీవు కాపాడితే అది నీ ఆరోగ్య ధర్మాన్ని కాపాడుతుంది..
శ్రమ ధర్మం (వ్యాయామ ధర్మం)
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకున్న ఆహారం సక్రమంగా అరగాలి. అరిగినది శరీరభాగాలకు అందాలి. అందినది వంటబట్టాలి. మిగిలిన వ్యర్థపదార్థాలు విసర్జింపబడాలి. అప్పుడు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే మరి ఈ పనులన్నీ శరీర అవయవాలు సక్రమంగా చేయాలంటే అవి బలంగా దృఢంగా వున్నప్పుడే సాధ్యమవుతుంది. దాని కోసం మనం శారీరక శ్రమ (వ్యాయామం) తప్పనిసరిగా చేయవలసినదే!
అందుకే పనిచేయకుండా తినేవాడు దొంగతో సమానం. అన్నారు పెద్దలు.. పూర్వకాలం మనపనులు మనం చేసుకోవటం హుందాగా భావించేవారు. కాని ఇప్పుడు మనం మన పనులను ఎవరితోనైనా చేయించుకోవడం ప్రెస్టేజీగా అనుకుంటాం. శరీరాన్ని సుఖపెట్టి మనస్సును కష్టపెట్టుకుంటున్నాం. 'దృఢమైన శరీరంలోనే బలమైన మనస్సును నిభంధించగలము' అన్నారు వివేకానందులు. మన గ్రామాలలో అందరూ ఏదోపని చేస్తూహాయిగానే వుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ శరీర శ్రమను అశ్రద్ధ చేయడం వలన అభ్మస్థైర్యం, ధీరత్వం తగ్గి అలత్వంతో జీవిస్తున్నారు. నిజంగా దృఢమైన శరీరం కలవారి ధైర్యం, వేరుగా ఉంటుంది. ఇంటిని చూసి ఇల్లలను చూడమన్నారు కదా !
అలాగే మన శరీరాన్ని చూసి మన పరిస్థితిని అంచనా వేయవచ్చు. వ్యవసాయ లల శారీరక శ్రమ చేస్తూనే వుంటారు. ఎక్కువ మంది ఆడవారు ఇంటి పనులు వారే చేసుకుంటూ చక్కగా వుంటున్నారు. కాని కొంతమంది అంటే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు లాంటి వారు మానసికంగా శ్రమచేస్తున్నారు. గాని శారీరక శ్రమను అశ్రద్ధ చేస్తు భారమైన శరీరం, పొట్టతో అవస్థలు పడుచున్నారు. కనుక ప్రతిరోజు ఉదయం కనీసం ఒక అరగంటైనా శరీరానికి వ్యాయామం లేక ప్రాణాయామం, లేక ఆసనాలు లాంటివి చేసి శక్తివంతులు కావచ్చు. కష్టపడటం వలన శరీరంలోని కణాలు శక్తివంతంగా తయారయ్యి మన జీవక్రియలను సక్రమంగా నిర్వహించగలుగుతాయి. తద్వారా లోని మలినాలు పోయి హాయిగా వుంటుంది. అయితే అధిక బరువు కలిగినవారు కష్టమైన వ్యాయామం చేయకూడదు. ముందు ఆహార నియమాలు పాటిస్తూ తేలికపాటి ఆసనాలు, ప్రాణాయామం లాంటివి చేసి శరీర బరువును సరిపడినంతగా తగ్గించుకుని అప్పుడు ఎంతటి కష్టమైనా చేయవచ్చు. లేదంటే శరీర అవయవాలు (కీళ్ళు లాంటివి) త్వరగా అరిగిపోతాయి.
తమపై తమకు నమ్మకం లేని వారికి దేనిపైనా నమ్మకం కుదరదు. శరీరం దృఢంగా వుంటే తమపై తమకు నమ్మకం తప్పక కలుగగలదు. అవసరమైతే కూలిపని చేసైనా. బ్రతకగలం అనే ధైర్యం వుంటుంది. తాతలనాటి ఆస్తి వున్నది కదా అని కూర్చుని తిందామంటే ఈ జన్మను వ్యర్థం చేసుకున్నట్లే | దానిని మన అభివృద్ధికి ఉపయోగించాలి కాని దానిపైనే ఆధారపడకూడదు. కనుక 'కష్టేఫలి' అయితే అధిక శ్రమకూడా అనర్థమే! అలసిన అవయవాలకు విశ్రాంతి అవసరం.
ఒక రోజు సరిగా నిద్రపోక పోతే మరునాడు అనీజీగా వుండి ఏపని సరిగా చేయలేము కదా ! అందుకే మనకు రోజుకు 7,8 గంటలు నిద్ర అవసరం. మన శరీరంలోని ప్రతి అవయవాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే వినియోగించాలి చూడండి మనం టి.వి ని అదేపనిగా చూస్తూ వుంటాము. కొంతకాలానికి కళ్ళజోడు అవసరం
ఏర్పడుతుంది. అలా దేనిని ఎక్కువగా ఉపయోగిస్తే అది అరిగిపోతుంది. అందుకే ఆరోగ్యానికి శాసనాలైన ఆసనాలను అభ్యాసం చేయండి. ఎవరు ఏవికావాలో అవి నేర్చుకుని ఆచరిస్తే చక్కటి శారీరక వ్యాయామం పొంది ఆరోగ్యంగా వుండవచ్చు.