విజయానికి, స్వయం ఆధిపత్యానికి మూలస్థంభాల లాంటి విజయ రహస్యాలు

KV Health Tips
0
Personality development,విజయానికి, స్వయం ఆధిపత్యానికి మూలస్థంభాల లాంటి విజయ రహస్యాలు


1 తక్కువ నిద్రపోండి. మీ జీవితం ఇంకా అర్థవంతంగానూ, ఇంకా ఫలప్రదంగానూ ఉండాలంటే మీరు పెట్టే పెట్టుబడి ఇదే. మంచి ఆరోగ్యానికి 6 గంటలకన్నా ఎక్కువ నిద్ర ఎక్కువ మందికి అవసరం లేదు. 21 రోజుల పాటు ఒక గంట ముందు లేవటానికి ప్రయత్నించి చూడండి. దాని తర్వాత అదే అలవాటయిపోతుంది. ఎంత సేపు నిద్రపోయారన్నది కాదు లెఖ, ఎంత గాఢ నిద్రపోయారన్నది లెఖ. అదీకాక మీకు జీవితంలో చాలా ముఖ్యమైన వాటి మీద మీ సమయాన్ని వెచ్చించటానికి మీకు నెలలో 30 గంటలు అదనంగా దొరికాయంటే ఎంత అదృష్టం !.


2. ప్రతిరోజూ ఉదయం పూట మీ వ్యక్తిత్వ వికాసానికి ఒక గంట కేటాయించుకోండి. ధ్యానం చేయండి. ఆ రోజువారీ కార్యక్రమాన్ని మీ ఊహా చిత్రంలో ఊహించుకోండి. మిమ్మల్ని ఉత్తేజపరిచే పుస్తకాలు చదవండి, మంచి ప్రసంగాలు , యూట్యూబ్ లో వినండి, ఉత్తమ గ్రంధాలు. చదవండి, ఏదైనా సరే మీ యిష్టం. నిశ్శబ్ద పూరితమైన ఈ గంటని మీ ఆత్మని జాగృతం చేసేలాగా. చేసుకోండి. వారంలో ఒక రోజైనా సూర్యోదయం చూడండి. ప్రకృతిలో గడపండి. పొద్దునే రోజుని సద్వినియోగం చేస్తే రోజంతా ఉత్తేజ భరితంగా ఉంటుంది. ఇదొక గొప్ప. తిరుగులేని పద్ధతి.


3 మీ జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు, అతి అనవసర విషయాల చెప్పుచేతల్లో ఉండనీయకండి. ప్రతిరోజు, మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వండి. *నా* *సమయాన్నీ, నా శక్తినీ సరియైన మార్గంలో వినియోగిస్తున్నానా*'? సమయ నియంత్రణే జీవిత నియంత్రణ కాబట్టి మీ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి. వృధా చేయవద్దు.


4. మీ మనసుని అదుపులో పెట్టటానికి, కేవలం సానుకూల ఆలోచనలే ఏర్పడటానికి రబ్బరు బ్యాండు పద్ధతి వాడండి. మీ చేతికి ఒక రబ్బరు బ్యాండు పెట్టుకోండి. మీ మనసులోకి ఒక ప్రతికూల ఆలోచన, మిమ్మల్ని నీరసపరిచే ఆలోచన వచ్చిన మరుక్షణం, రబ్బరు బ్యాండు లాగండి. అలా నాలుగు సార్లు చేస్తే ప్రతికూల ఆలోచన వస్తే శరీరానికి బాధకలుగుతుందన్న విషయం మనస్సుకి తెలుస్తుంది. దాంతో ప్రతికూల ఆలోచన తొలగిపోయి అన్నీ సానుకూల ఆలోచనలే పుట్టేట్టు మనస్థితి పొందుతారు.


5. ఫోను మ్రోగినప్పుడల్లా ఉత్సాహంగా, ఉల్లాసంగా పలకరించండి. ఫోను చేసిన వ్యక్తి మీకెంతో కావాల్సిన వ్యక్తి అన్న భావన కలగజేయండి. మంచి ఫోన్ మానర్స్ ఎంతో ముఖ్యం. సాధికారికంగా ఏదైనా చెప్పాలంటే లేచి నిల్చోండి. మీకు తెలియకుండానే మీ గొంతులో ఆత్మస్థైర్యం పెరుగుతుంది.


6. రోజు మొత్తంలో మనకి ఎన్నో స్ఫూర్తి దాయకమైన, శ్రేష్ఠమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అందుకని కొన్ని కార్డులు (విజిటింగ్ కార్డులంత సైజువి ఏ స్టేషనరీ షాపులో అడిగినా దొరుకుతాయి ఒక పెన్సిల్ మీ పర్సులో పెట్టుకోండి అప్పుడు ఆలోచన కలిగిన దర్శనం అది అకార్డు మీద పెట్టేయొచ్చు ఇంటికెళ్లాక దాన్ని ఏదైనా నోట్ ప్యాడ్ లోను మీకు కనిపించే చోట పెట్టండి.

మనిషి మనసు ఒక కొత్త భావనతో ఇచ్చుకుంటే మళ్ళీ దాని పాత ఆ కారానికి వెనక్కి వెళ్ళదు



Post a Comment

0Comments
Post a Comment (0)