చంద్రయాన్ 3 ద్వారా ప్రపంచ దేశాలలో మన భారతదేశ ఖ్యాతిని నలుమూలలకి విస్తరించిన ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) ఈ రోజున తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా విక్రమ్ ల్యాండర్ యొక్క ఫొటోస్ ను విడుదల చేసింది ఈ ఫొటోస్ ను ప్రజ్ఞాన్ రోవర్ తన నావిగేషన్ కెమెరా ద్వారా తీసింది.
విక్రమ్ ల్యాండర్ ఫొటోస్ ని పోస్ట్ చేసిన ఇస్రో తన అధికారిక ట్విట్టర్లో "ఇమేజ్ ఆఫ్ ది మిషన్" అని టైటిల్ ఇచ్చింది.
ఇదేగాక ప్రజ్ఞాన్ రోవర్ పలు ఆసక్తికర పరిశోధనలు చంద్రునిపై చేస్తుంది , ఇప్పటికే ప్రజ్ఞాన్ రోవర్ చంద్రునిపై పలు ఖనిజాలు ఉన్నాయని తెలియజేసింది వాటిలో మాంగనీస్, అల్యూమినియం, సిలికాన్ ఉన్నాయని తెలియజేసింది అంతేకాక చంద్రునిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడాను ఉన్నాయని కనుగొంది.
వీటితోపాటు ప్రజ్ఞాన్ రోవర్ హైడ్రోజన్ అన్న వాళ్ల కోసం కూడాను తన పరిశోధనను మొదలు పెట్టినది అని ఇస్రో శాస్త్రవేత్తలు అధికారిక ప్రకటన చేశారు, మరియు ఈ ఖనిజం లవణాలకు సంబంధించి కూడాను ఒక గ్రాఫ్ ను వారు రిలీజ్ చేశారు.
వీటన్నింటినీ చూస్తుంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం ప్రపంచ దేశాల అన్నిటికంటే కూడాను శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో తన సత్తాని చాటుకుంటుంది అని తెలుస్తుంది. అంతేకాదు అంతరిక్ష రంగంలో ఇప్పటివరకు పెద్దన్న గా ఉన్న అమెరికాను సైతం మన దేశం అధిగమిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇప్పటికే అమెరికా చంద్రుని మీదకి వ్యోమగాములు పంపించి తన సత్తా చాటుకుంది. కానీ వారు చేసినటువంటి ఈ మిషన్ ఎంతవరకు నిజమో కాదు అని ప్రపంచంలోనే చాలా దేశాలు మరియు ప్రజలు చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి కారణం అప్పటిదాకా చంద్రునిపై ఎన్నో ప్రయోగాలు చేసిన నాసా సడన్ గా తన ప్రయోగాలన్నిటిని నిలిపివేయటమే కారణం కావచ్చు.
ఏది ఏమైనా అంతరిక్ష పరిశోధనలో ప్రపంచ దేశాల అన్నిటికంటే భారతదేశ ముందంజలో ఉంటుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఒన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ ఇస్రో...