ఆడవారు పరాయి మగవారితో అక్రమ సంబంధానికి గల కారణాలు

KV Health Tips
0

ఆడవారు పరాయి మగవారితో అక్రమ సంబంధానికి దారి తీసే అటువంటి పరిస్థితులు చాలానే ఉన్నాయి వాటిలో మనం కొన్నిటిని ఇప్పుడు తెలుసుకుందాం, మొదటిగా భార్య భర్తలు వారు శరీరకంగా కలిసినప్పుడు భర్త తన భార్య యొక్క హావ భావాలను ఆలోచనలను అర్థం చేసుకొని తన భార్య భావ సంతృప్తి చెందిందా లేదా అని తెలుసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఆడవారు పరాయి మగవారితో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.

మగవారు ఆఫీసులో ఉన్న టెన్షన్స్ వల్ల మరియు ఆర్థికపరమైన ఒత్తిడి వల్ల ఎంతో చిరాకుగా ఇంటికి వస్తూ ఉంటారు అలాంటి సమయంలో వారి కున్నటువంటి ప్రస్టేషన్ మరియు బాధ అంత కూడాను తన భార్య మీద చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో భార్యకు తన భర్త మీద ఉన్నా ప్రేమ కూడాను సన్నగిల్లవచ్చు అప్పుడు ఆ స్త్రీ తన భర్తకు ఉన్నటువంటి సమస్యల గురించి ఆలోచించకుండా తన భర్తను అపార్థం చేసుకొని పరాయి మగవారితో అక్రమ సంబంధం పెట్టుకోడానికి కూడాను ఇలాంటి పరిస్థితులు దారి తీస్తాయి అందర్నీ అనలేం కానీ కొందరిలో ఇలా జరగవచ్చు కావున ప్రతి ఒక్క మగవారు కూడాను ఎలాంటి సమస్య అయినా ఇంటిలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయి తన భార్యతో పిల్లలతోనూ సంతోషంగా గడపాలి. 


భార్య భర్తల సంబంధం,శృంగార జీవితం,ఆడవారి అక్రమ సంబంధాలు,ఆడవారు పరాయి మగవారితో అక్రమ సంబంధానికి గల కారణాలు


మరికొందరి ఆడవారి విషయంలో కూడా వారు అక్రమ సంబంధం పెట్టుకోటానికి గల కారణాలు వారి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడాను కావచ్చు ఎలాగనగా ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద అయినా తన భర్త తన కుటుంబ అవసరాలను మరిచిపోయి తాగుడుకు మరియు వ్యసనాలకు బానిసై అటువంటి ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఆడవారు తమ కుటుంబ అవసరాల కోసం పరాయి మగవారితో అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు కావున మగవారు తనకున్నటువంటి బాధ్యతలను మరువకూడదు .

కొంతమంది ఆడవారి విషయంలో వారికి ఇష్టం లేని వివాహాలను వారి పెద్దలు చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో కొంతమంది ఆడవారు ఇలాంటి వివాహాల నుంచి వైదొలగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు,

కొంతమంది ఆడవారికి వివాహం అయిన తర్వాత తన భర్త,తన ఆశలను కోరికలను నెరవేరుస్తాడని ఎంతగానో ఆశ పడుతూ ఉంటారు ఎందుకంటే వారికి వారి జీవితం పట్ల ఎంతో ఉన్నత స్థానాలకి వెళ్లాలని ఆశ ఉంటుంది. అది వారి ఉద్యోగంలో కానీ చదువుల్లో కానీ ,కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వివాహం చేసుకోవడం జరుగుతుంది అలాంటి సందర్భంలో చాలామంది ఆడవారు తమ భర్త తమకు అండగా ఉంటాడని అన్ని విషయాల్లో తోడుగా ఉంటారని అనుకుంటారు కానీ వారు ఆశించిన దానికి విరుద్ధమైన పరిస్థితులు ఉన్న ఎడల వారు ప్రత్యామ్నాయ పరిస్థితులు  ఎన్నుకునే ప్రమాదం ఉంది కావున ప్రతి ఒక్క మగవారు కూడాను తన భార్య పట్ల ప్రేమ,  శ్రద్ధ చూపాలి.


కొందరు ఆడవారు   వ్యసనాలకు బానిసలై కుటుంబాన్ని వదులుకొని వారికి ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటివారు కన్న తల్లిదండ్రులు గాని కట్టుకున్న భర్తని కానీ పట్టించుకోరు , వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు, ఇదేవిధంగా అనేక రకమైన కారణాలు ఆడవారు పరాయి మగవారిని కోరుకోవడానికి ఉన్నాయి. 


అదేవిధంగా ప్రతి భర్త కూడాను తన భార్య పట్ల శ్రద్ధ ప్రేమ కలిగి ఉండాలి, ఆడవారికి చాలా ఆశలు ఉంటాయి వాటిని కొంతవరకు అయినా మనం అర్థం చేసుకొని వారికి సపోర్టుగా ఉండాలి వివాహం అయిన తర్వాత ప్రతి భార్య కూడాను తన భర్త తనను ఎంతగానో ప్రేమతో చూసుకుంటారని ఆశ పడుతూ ఉంటారు అలాంటి సమయంలో మన దగ్గరికి వచ్చిన భార్యను ఎప్పుడు కూడాను చులకనగాను అసహ్యం కాను చూడకూడదు ఎప్పుడు అయితే భార్య పట్ల చులకన భావం కలిగి ఉంటాము అటువంటి సందర్భంలో భార్యకు కూడాను మన మీద ఉన్న ప్రేమ పోతుంది.

ఇదే విధంగా భార్య కూడాను తన భర్తను అర్థం చేసుకొని తన యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని తనకి ఎల్లప్పుడూ కూడాను సపోర్ట్ గా ఉండాలి.

 భార్యాభర్తల బంధం ఎంతో అమూల్యమైనది ఆ బంధాన్ని చిన్న చిన్న అపార్థాల వల్ల పోగొట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు భార్య భర్తల ఇరువురికి ఏదైనా సమస్య ఉంటే ఒకరికి ఒకరు కూర్చుని ఆ సమస్యలను పరిష్కరించుకోవాలి అంతేకానీ అక్రమ సంబంధాల వైపు కానీ చెడు మార్గాల వైపు కానీ వెళ్లి  జీవితాన్ని వారి వివాహ బంధాన్ని నాశనం చేసుకోకూడదు మన భారతీయ వివాహ బంధం ప్రపంచ దేశాలన్నిటిలో కూడాను ఎంతో గొప్పది ఎన్నో దేశాలు కూడాను మన వివాహ వ్యవస్థను చూసి ఎంతో గొప్పగా చెప్పుకుంటాయి అలాంటి మన వివాహ వ్యవస్థను క్షణికావేసానికి పోయి పాడు చేసుకోకూడదు ఏ సమస్య ఉన్న  భార్యాభర్తలు ఇరువురు కూర్చొని చర్చించుకోవాలి అప్పుడే ఆ వివాహ బంధం నిలుస్తుంది.

ఏది ఏమైనా కానీ భారతదేశ వివాహ వ్యవస్థ చాలా గొప్పది ఎన్ని బాధలు వచ్చినా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ , భార్యాభర్తలు ఇరువురు కలిసే ఉంటారు కారణం మన తల్లిదండ్రులు మన దేశ సంస్కృతి మనకు నేర్పిన గొప్ప నీతి.


Post a Comment

0Comments
Post a Comment (0)