ఏ సమయంలో శృంగారంలో పాల్గొంటే గర్భం వస్తుందో మరియు గర్భం రావడానికి భార్య భర్తలు ఇరువురు కూడాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ,వారి యొక్క జీవనశైలి మరియు వారు శృంగారంలో ఎలా ఉండాలో అనేటువంటి విషయాలు ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం.
పెళ్లయిన దంపతులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేటువంటి విషయం ఏమిటి అంటే వారి యొక్క సంతానం కోసం , అమ్మానాన్న అని పిలిపించుకునే భాగ్యం కోసం, కానీ కొన్ని సందర్భాల్లో వారు ఎంతగా ప్రయత్నించనా వారికి సంతానం కలగకపోవచ్చు, దీనికి ప్రధాన కారణం భార్య భర్తలు ఇరువురు వారు కలయికలో పాల్గొనే సమయం గురించి సరేనా అవగాహన లేకపోవడం , ఇది కూడా ఒక ప్రధాన కారణం కావచ్చు .
సాధారణంగా స్త్రీకి పీరియడ్స్ జరిగిన 14 రోజుల తర్వాత అండం విడుదల అవుతుంది కొన్ని సందర్భాలలో 12 నుంచి 16 రోజుల మధ్యలో అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో భార్యాభర్తలు ఇరువురు కూడాను కలయికలో పాల్గొనడం వల్ల గర్భాధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.
అండం విడుదలయ్యే సమయం చూసి అనగా పీరియడ్స్ జరిగిన 12 నుంచి 16 రోజుల మధ్యలో అనగా నాలుగు నుంచి ఐదు రోజులు భార్య భర్తలు ఇరువురు కూడాను కలయికలో పాల్గొనాలి ఈ విధంగా అండం విడుదలయ్యే సమయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకొని ఆ సమయంలో కలయికలో పాల్గొనడం వల్ల గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కానీ చాలామంది భార్య భర్తలకి ఈ విషయం తెలియక సంతానం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ మానసికంగా కృంగిపోతారు. కావున ఏ భార్యాభర్తలు కూడాను మానసికంగా కృంగి పోవలసిన అవసరం లేదు చక్కగా వారు వారి సంసార జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ సంతానాన్ని పొందవచ్చు ఇక్కడ వివరించి పద్ధతులను పాటిస్తే.
అండం విడుదల సమయంలో ఆడవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వాటి ద్వారా మనం అండం విడుదల సమయాన్ని సరిగ్గా లెక్కించవచ్చు.
అలా కనిపించే లక్షణాలు ఏమీ అనగా మొదటిగా వారి పొత్తికడుపులో నొప్పి వస్తుంది అలాగే ఆడవారి యోని నుంచి కొన్ని ద్రవాలు ఉత్పత్తి అయి వస్తూ ఉంటాయి ఆ విధంగా కూడాను అండం విడుదల సమయాన్ని గుర్తించవచ్చు. ఆడవారిలో అండం విడుదలవుతున్న సమయంలో వారిలో కామ కోరికలు కూడాను ఎక్కువగా వస్తాయి, మరియు వారికి ఎన్నిసార్లు కలిసినా కూడా మరల మరల కలవాలి అనిపిస్తుంది ఈ విధంగా కూడాను అండం ఎప్పుడు వస్తుందో ఆ వచ్చే సమయాన్ని మనం ఒక అంచనా వేయవచ్చు. ఇలా గుర్తించిన తర్వాత ప్రతి భర్త కూడాను తన భార్యతో శృంగారంలో నాలుగు నుంచి ఐదు రోజులు పాల్గొనాలి మరియు భార్యాభర్తలు ఇరువురు కలిసిన తరువాత భార్య తన యోనిని నీటితో కడగడం కానీ శుభ్రం చేయడం కానీ చెయ్యకూడదు.
అంతేకాకుండా మీరు ఇరువురు కలిసిన తర్వాత హడావిడిగా బయటికి తీయకూడదు ఎలా అయితే కలిశారో అలాగే ఒక 10 నుంచి 15 నిమిషాలు అదే పొజిషన్లో ఉండాలి . ఈ విధంగా చేయడం ద్వారా వారికి గర్భధారణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మరికొన్ని విషయాలు భార్య భర్తలు ఇరువురు గుర్తుంచుకోవాలి అవి ఏమిటి అంటే , వారు ఇరువురు కూడాను శృంగారంలో పాల్గొనే సమయంలో ఎంతో ప్రశాంతతతో మరియు హాయిగా ఆ సమయాన్ని తమ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయాలి అంతేకానీ మానసిక ఒత్తిడిలో ఉండకూడదు మరియు మగవారు కూడాను వారి వ్యసనాలను అనగా ధూమపానం ,మద్యపానం మానివేయాలి లేనిచో వారి శుక్రకణాల సంఖ్య తగ్గి గర్భం రావడం కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కావున ప్రతి మగవారు కూడాను ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకొని తగురకంగా జాగ్రత్త పడవలెను మరియు యోగ ఆసనాలు ఎక్ససైజ్ చేయాలి ఈ విధంగా చేయడం ద్వారా వారు కలిసిన సమయాన్ని ఎంతో హాయిగా ఆస్వాదిస్తారు అంతేకాక భార్యాభర్తల సంబంధం కూడా మెరుగుపడుతుంది
భార్యాభర్తల ఇరువురికి వృత్తిపరంగాను కుటుంబ పరంగాను ఎన్ని ఒత్తిడిలు ఎన్ని ఒడిదుడుకులు ఉన్న కానీ వారి సంసార జీవితాన్ని హాయిగా గడపాలి , ఇవి అన్నీ కూడాను మగవారి శుక్ర కణాల మీద మరియు ఆడవారి అండం మీద ప్రభావం చూపుతాయి మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మగవారిలోని శుక్రకణాలు ఆడవారిలోని అండంతో కలిసినప్పుడు ఆ అండం ఫలదీకరణం చెందుతుంది ఈ విధంగా ఆ స్త్రీకి గర్భం వస్తుంది.