ఏ భార్య కూడాను భర్తకు చెప్పనటువంటి కొన్ని రహస్యాలు

KV Health Tips
0

 ఏ భార్య కూడాను భర్తకు కొన్ని రహస్యాలు అస్సలు చెప్పదు అవి ఏమిటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.


మన భారతదేశంలో భార్య భర్తల బంధం చాలా గొప్పది విదేశాల్లో ఉండే వారు కూడాను మనదేశంలోని   వివాహ వ్యవస్థ పై ఆసక్తి కలిగి ఉంటారు కారణం మన దేశంలోనే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ మరియు వారు జీవితాంతం కూడాను ఒకరి ఎడల ఒకరు   నమ్మకం కలిగి జీవిస్తూ ఉంటారు .


భర్తకు చెప్పనటువంటి భార్య రహస్యాలు,శృంగార జీవితం,భార్య రహస్యాలు,భార్య భర్తల సంబంధం,ఏ భార్య కూడాను భర్తకు చెప్పనటువంటి కొన్ని రహస్యాలు


  కానీ పాశ్చాత్య దేశాలలో వారి వివాహ వ్యవస్థ మనలాగా ఉండదు అందుకనే పాశ్చాత్య దేశాల వారు మన వివాహ వ్యవస్థను ఎంతో ఇష్టపడుతూ ఉంటారు అలాంటి మన వివాహ వ్యవస్థను చాలా పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది . చిన్న చిన్న  విషయాలకు మరియు చిన్న చిన్న పట్టింపులకు పోయి ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు చాలామంది మనదేశంలో కూడా విడిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు వివాహ వ్యవస్థలో  భార్య భర్తలు ఇరువురు కూడాను ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటారు.

మరియు కుటుంబ వ్యవస్థలో భార్య ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. చాలా మంది భార్యలు కొన్ని విషయాలు మాత్రం భార్య భర్తకు ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పదు అవి ఏమిటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా భర్త కుటుంబ అవసరాల నిమిత్తం తనకు ఇచ్చిన డబ్బులు నుంచి ప్రతి భార్య కూడా కొంత డబ్బు భర్తకు తెలియకుండా దాస్తూ ఉంటుంది వాటి గురించి ఎప్పుడు కూడాను భర్తకు చెప్పదు కానీ తన భర్తకు మరియు కుటుంబంలో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని కుటుంబ అవసరాల నిమిత్తం ఉపయోగిస్తుంది ఈ విధంగా భార్య కుటుంబంలో తన మనీ మేనేజ్మెంట్ పద్ధతిని అమలు చేస్తుంది.


 రెండవదిగా తన పుట్టింటిలో ఏమైనా సమస్య వచ్చినా లేక తన భర్తను చులకనగా మాట్లాడిన అలాంటి పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తన భర్తకు తెలియకుండా దాస్తుంది కారణం ఈ విషయాలు మొత్తం చెబితే తన భర్త ఎక్కడ బాధపడతాడు అని చెప్పదు. తనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత బాధ వేసినా తన భర్తతో మాత్రం సంతోషం మాత్రమే పంచుకుంటుంది. తమ పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా తన భర్తకి తెలియకుండా వాటిని తనలోనే దాచుకుంటుంది మరియు తన పిల్లలను సన్మార్గంలో పెట్టడానికి పెట్టడానికి నిరంతరం కృషి చేస్తుంది.

తనకు పెళ్లి కాకముందు ఏమైనా ప్రేమ వ్యవహారం ఉంటే అటువంటి విషయాలు కూడాను తన భర్తతో చెప్పరు ఎందుకంటే వారు తమను అపార్థం చేసుకుంటారు అని భయపడుతూ ఉంటారు. కానీ పెళ్లయిన కొన్నాళ్ళకు తమ భర్త చూపించేటువంటి ప్రేమకు అన్ని మర్చిపోయి తమ భర్తతో హాయిగా తమ సంసార జీవితాన్ని గడుపుతారు.


 కానీ కొంతమంది ఆడవారు ధైర్యం చేసి తమ గత  జీవితంలో జరిగినటువంటి విషయాలను తమ భక్తులకు చెబుతారు అటువంటి సమయంలో భర్తలు కూడాను ఒకటి చాలా గుర్తు పెట్టుకోవాలి అదేమిటంటే తమ భార్య ఈ విషయాలను దాచి కూడాను తమతో సంసారం చేయొచ్చు కానీ ఈ విషయం దాయకుండా తనతో డిస్కస్ చేసింది అంటే ఆమె నిజాయితీగా ఉంది అని ఆలోచించుకొని ,గత  జ్ఞాపకాలు మర్చిపోయి  వారు ఇరువురు కూడాను జీవితాన్ని సంతోషంగా గడపాలి .


 అంతేకాదు తనకేదైనా ఆరోగ్యం బాగాకపోయినా లేక  ఎవరి వల్ల అయినా మనసుకు నొప్పి కలిగిన వాటన్నిటిని తన భర్తతో చెప్పకుండా తనలోనే దాచుకుంటుంది ఎందుకు అంటే! భర్త అంటే భార్యకు అంత ప్రేమ కాబట్టి తాను ఎక్కడ బాధపడతాడు అని ఆ బాధనంతా కూడాను తనలోనే దాచుకుంటుంది.


  గుణవంతురాలు అయినా శ్రీ తన అత్తమామల వలన ఎంత బాధ కలిగిన వాటిని కూడా తన భర్తతో చెప్పదు.

ఏది ఏమైనా గానీ అన్ని వదులుకొని తమతో వచ్చినటువంటి తమ భార్యలను   ప్రతి భర్త కూడాను వారి యొక్క మనసు నెరిగి   వారిని ఎంతో ప్రేమతో చూసుకోవాలి ఎందుకంటే ప్రతి భార్య కూడాను తమ  భర్తయే  సర్వస్వం అనుకోని కనిపెంచినటువంటి తమ తల్లిదండ్రులను సైతం వదులుకొని మనతో జీవితం పంచుకోవడానికి మన వెంట వస్తారు కావున ప్రతి ఒక్క పురుషుడు కూడాను భార్యను ప్రేమించాలి.


 పాశ్చాత్య దేశాలలో  ఇలాంటి కమిట్మెంట్స్ భార్యాభర్తల మధ్య ఉండదు కాబట్టి వారి వివాహ బంధం  చాలా బలహీనంగా ఉంటుంది.  


  ఇవన్నీ చూస్తుంటే ప్రతి భార్య కూడాను తమ భర్తల దగ్గర కొన్ని విషయాలు చెబుతారు, కొన్ని విషయాలు మాత్రం చెప్పరు వాటన్నిటిని కూడాను తమ మనసులో ఉంచుకొని బాధపడుతూనే ఉంటారు కానీ తమ బాధను మాత్రం భర్తకు కానీ కుటుంబ సభ్యులకు కానీ చెప్పరు అదే భారతదేశ  స్త్రీ యొక్క గొప్పతనం.



Post a Comment

0Comments
Post a Comment (0)