ఈ మధ్యకాలంలో పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గటానికి గల కారణాలు మరియు స్పెర్మ్ కౌంట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో చాలామంది పురుషులలో ఈ సమస్య వెంటాడుతూ ఉంది పైకి ఆరోగ్యంగా కనిపిస్తూనే లోపల ఈ సమస్య వారిని వెంటాడుతూ ఉంది దీనికి గల కారణాలు అనేకం ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనం ఇప్పుడు చర్చించుకుందాం.
అసలు ఆరోగ్యమంతమైన పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ఒక మిల్లీ లీటర్స్ స్పెర్మ్ లో 150 మిలియన్ నుంచి 200 మిలియన్స్ వరకు ఉంటాయి, కానీ పురుషుని యొక్క సంతాన ఉత్పత్తి సామర్థ్యం స్పెర్మ్ కౌంట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు స్పెర్మ్ యొక్క కదలిక అనగా శుక్రకణాలు ఎంత ఆరోగ్యంతో కదులుతున్నాయి మరియు మరియు వాటి యొక్క బాహ్య ఆకారం కూడా పురుషుని యొక్క సంతాన సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి, అసలు ఈ శుక్ర కణాలు సంఖ్య తగ్గడానికి గల కారణాలు మనం ఇక్కడ తెలుసుకుందాం.
పురుషునిలో సాధారణంగా శుక్రకణాల సంఖ్య తగ్గటానికి గల కారణాల్లో మొదటిగా వారు తీసుకునేటటువంటి ఆహారం, ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ఫుడ్స్ మరియు బయట తిండి అయినటువంటి ఆయిల్ ఫుడ్స్, బిర్యానీస్ మరి ఇంకా ఎన్నో అనారోగ్య కరమైనటువంటి జంక్ ఫుడ్స్ తింటూ ఉన్నారు, వీటివల్ల మంచి ఆరోగ్యం రాకపోగా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి వాటిలో ముఖ్యంగా పురుషునిలో సంతాన సామర్థ్యం తగ్గటం మరియు గ్యాస్ ట్రబుల్ ఇంకా క్యాన్సర్ కారకాలు ఎన్నో ఉన్నాయి.
తర్వాత మరికొన్ని కారణాలు పని ఒత్తిడి మరియు సరియైన నిద్ర లేకపోవడం, సాధారణ మానవుడికి ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర కావాలి కానీ పెరుగుతున్నటువంటి ఈ ఆధునిక యుగంలో ఎప్పుడు కూడాను పని ఒత్తిడిలో సరైన నిద్ర, సరైన విశ్రాంతి లేకుండా పోతుంది, అస్సలు పురుషునిలో శుక్రకణాల సంఖ్య తగ్గటానికి కారణాల్లో ఇది ప్రధానంగా చెప్పవచ్చు.
తర్వాత గల మరొక కారణం శారీరక శ్రమ లేకపోవడం, శరీరానికి సరైన శ్రమ అనగా సరైన ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల మరియు బయట దొరికేటువంటి జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వల్ల కూడాను స్థూలకాయత్వం పెరుగుతుంది దీని మూలంగా పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.
కావున మనం తినే ఆహారం కూడాను చాలా మితంగాను ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆకారం తినాలి కూరగాయలు ,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. మరియు బాడీ బిల్డింగ్ కి ఉపయోగపడే స్టెరాయిడ్స్ వంటివి కూడాను తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గి వందత్వం వస్తుంది.
పర్యావరణ కాలుష్యం మరియు రసాయనాలు మరియు పురుగు మందులు పిచికారి చేసినటువంటి ఆహార పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలి మరియు మీరు ఒకవేళ రసాయన సంబంధమైన ఉద్యోగాలలో ఉంటే వాటి నుండి రక్షణగా మీరు ప్రత్యేకమైనటువంటి దుస్తులు ధరించాలి.
ఈ విధంగా మీరు మిమ్మల్ని కాపాడుకోవడం ద్వారా స్పెర్మ్ కౌంట్ ని పెంచుకోవచ్చు.
వేడి అయిన వస్తువులకు అనగా వేడి చేసేటువంటి పదార్థాలకు దూరంగా ఉండండి. వేడి ఎక్కువగా ఉండటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది అలాగే మీరు ధరించేటువంటి దుస్తుల విషయంలో కూడా సరియైన జాగ్రత్త తీసుకోవాలి బిరుదుగా ఉండే దుస్తులు ధరించకూడదు వీటివలన రక్త ప్రసరణ సరిగ్గా జరగక కణాలు తగ్గి స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం ఉంది కావున ప్రతి ఒక్కరు కూడాను దుస్తుల విషయం జాగ్రత్తగా ఉండాలి మరియు వేడిని తగ్గించుకోవాలి.
రోజు ఎక్కువ మొత్తంలో నీటిని తీసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల స్పెర్మ్ కౌంట్ మరియు వాటి చలన శీలత మెరుగుపడే అవకాశం ఉంది.
ధూమపానం అస్సలు చేయకూడదు దీనివలన మీయొక్క స్పెర్మ్ కౌంట్ మరియు వాటి నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది అలాగే మద్యపానం సేవించకూడదు దీని ద్వారా కూడాను పురుషులలోని స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. కావున సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరియు వాటి యొక్క చలనశీలతను పెంచుకోవడానికి కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి వాటిని వైద్యులు యొక్క పర్యవేక్షణలో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి అవి ఏమి అనగా జింక్, సెలీనియం మరియు విటమిన్ సి, విటమిన్ డి వంటి వాటిని తీసుకోవడం ద్వారా మీయొక్క స్పెర్మ్ కౌంట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది దేనికి అంటే మీరు కానీ మధుమేహం మరియు కొన్ని హార్మోన్ అసమతుల్యత సమస్యలతో ఉన్నట్లయితే మీరు కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి మరియు మీ సంబంధిత డాక్టర్ నుంచి సరియైన మందులు వీటికి వాడడం వల్ల హార్మోన్స్ అసమతుల్యత మరియు మధుమేహాన్ని కంట్రోల్ చేసుకొని మీ యొక్క స్పెర్మ్ కౌంట్ ని పెంచుకోవచ్చు మరియు వాటి యొక్క క్రియాశీలతని పెంచుకోవచ్చు.
ఈ విధంగా సరియైన ఆరోగ్య అలవాట్లు అన్వయించుకోవడం ద్వారా మీ యొక్క స్పెర్మ్ కౌంట్ మరియు వాటి యొక్క కదలికని పెంచుకోవచ్చు, ఈ విధంగా సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి పురుషులకు పైన తెలిపినటువంటి మార్గాలు ఉపయోగకరంగా ఉంటాయి.