భార్య తన భర్తను ఎలా లొంగ తీసుకోవాలి మరియు భర్త ప్రేమను ఎలా పొందాలి

KV Health Tips
0

 భార్య తన భర్తను ఎలా లొంగ తీసుకోవాలో మరియు తన చెప్పు చేతల్లో ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు, ఇక్కడ చూద్దాం. చాలామంది స్త్రీలకు ఉండేటువంటి ఒకే ఒక్క కోరిక తన భర్త తన మాట వినాలని  అని మరియు తనను ఎంతో ప్రేమగా చూసుకోవాలని అని ప్రతి భార్య కూడాను అనుకుంటూ ఉంటుంది. సాధారణంగా చాలామంది స్త్రీలు నాకు పెళ్లయి 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది కానీ నా భర్త నా మాట వినడం లేదు ఏం చేయాలి  అని తమలో తాము ఆలోచిస్తూ ఉంటారు మరియు బయట వారితో కూడా  చెప్పుతూ ఉంటారు, వీటన్నిటికీ కూడా సమాధానం మీరు ఏం చేయాలో, ఏం చేస్తే మీ భర్త మీ మాట వెంటాడు ఇక్కడ మనం తెలుసుకుందాం.


భార్య తన భర్తను ఎలా లొంగ తీసుకోవాలి,శృంగార జీవితం,భర్త ప్రేమ,భర్తను లొంగ తీసుకోవడం


 వీటిలో మొదటిగా ఏ భార్య కూడాను తన భర్తను చులకనగా చూడకూడదు అనగా చులకనగా మాట్లాడటం కానీ, అలాగే నలుగురిలో ఉన్నప్పుడు చులకనగా చూడటం కానీ, అవమానకరంగా మాట్లాడటం కానీ చేయకూడదు ఎందుకంటే భర్త అంటే భార్యలో సగభాగం మరియు మన భారత దేశ సమాజంలో భర్తను చూసే ఆ భార్యకు విలువ గౌరవం ఇస్తారు అలాంటి భర్తను మనం చులకనగా మాట్లాడటం ద్వారా మనమే సమాజంలో మన విలువను తగ్గించుకుంటాం, అదియు గాక మీ భర్త దృష్టిలో మీపై ప్రేమ రాకపోగా కోపం మీరంటే అసహ్యం వస్తాయి, కావున ఎప్పుడు కూడాను ఇలా చేయకూడదు.

 మరియు మీ భర్తకి మీరంటే ప్రేమ కలగాలి అంటే తనకిష్టమైనటువంటి వంటకాలను ఎంతో ప్రేమతో ప్రతిరోజు కూడాను తయారుచేసి మీరే పక్కనుండి తినిపిస్తూ ఉండాలి ఎలా అనగా ఒక తల్లి తన బిడ్డకు తినిపిస్తున్నట్టు ఇలా చేస్తే మీ భర్తకు మీపై ప్రేమ గౌరవం వస్తాయి.


ముఖ్యంగా మీ భర్త భోజనం చేసే సమయంలో అతని పక్కన కూర్చొని అతనితో హాయిగా ముచ్చటిస్తూ ఉండాలి అంతేకానీ మీ భర్తకు చిరాకు తెప్పించేటువంటి విషయాలు ఏమి కూడాను ఆ సమయంలో మాట్లాడకూడదు.


మగవారు తన ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి వల్ల ఎంతో  చిరాకుతోను మరియు బాధతోను ఉంటాడు అలాంటి సమయంలో మీరు మీ భర్తకు తోడుగా ఉండి మంచి చెడ్డలు మాట్లాడుతూ ఉండాలి అంతేకానీ మీరు భర్తకు చిరాకు తెప్పించ కూడదు, ఎందుకంటే ఈ ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరు కూడాను మానసికంగాను శారీరకంగానూ ఇబ్బంది పడుతున్న వారే.


భార్య తన భర్తను ఎలా లొంగ తీసుకోవాలి,శృంగార జీవితం,భర్త ప్రేమ,భర్తను లొంగ తీసుకోవడం


మీ భర్తకు ఆరోగ్యం బాగుండకపోతే అటువంటి సమయంలో మీరు దగ్గరుండి అతన్ని ఎంతో ప్రేమతో జాగ్రత్తగా చూసుకోవాలి, అతనికి కావలసినటువంటి అన్ని పరిచర్యలు చేయాలి ఎలా అంటే ఒక తల్లి తన కుమారునికి  ఆరోగ్యం బాగోకపోతే  ఎలా పరిచర్యలు చేస్తుందో ఆ విధంగానే మీరు కూడాను మీ భర్తకు  పరిచర్యలు చెయ్యాలి, ఇలా చేయడం ద్వారా మీ భర్తకు మీపై ప్రేమ గౌరవం పెరుగుతుంది.

మరియు మీరు మీ భర్త యొక్క కుటుంబ సభ్యులతోనూ మరియు మీ పిల్లలతోనూ మీ మాట తీరు మీ ప్రవర్తన సరిగ్గా ఉందో లేదో మీరే పరిశీలించుకోవాలి మరియు మీ అత్తమామలను మీరు ఎంత ప్రేమిస్తే మీ భర్త కూడాను మిమ్మల్ని అంతగా ఇష్టపడతాడు, మీ అత్తమామలే కాదు మీ ఆడపడుచులు మరియు మీ తోడికోడలతో కూడాను మీరు  సఖ్యత కలిగి ఉండాలి, ఎందుకంటే మీ భర్త ప్రేమ ఒక్కటే కాదు మీకు భవిష్యత్తులో కానీ ఏమైనా సమస్య  వస్తే వారే మీకు తోడుగా అండగా ఉంటారు, అలాంటి వారిని మీరు ఎప్పుడు కూడాను దూరం చేసుకోకూడదు, మీ ప్రవర్తన ఈ విధంగా మర్యాదగా ఉంటే మీ అత్తమామలు మరియు మీ కుటుంబ సభ్యులు మీ భర్త తో పాటు మిమ్మల్ని ఎంతో గౌరవిస్తారు .


 మరియు మీరు బయటికి వచ్చినప్పుడు మీ పొరుగువారితో మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి, మీరు మీ పొరుగు వారితో మాట్లాడేటప్పుడు ఎకిలిగా నవ్వకూడదు, ఇలా నవ్వడం వల్ల మీపై మీ ప్రవర్తన పై చెడు ఉద్దేశం బయటకు వెళుతుంది మరియు మీ భర్తలో కూడాను మీపై చులకన భావం మరియు చెడు అభిప్రాయం కలుగుతుంది, కావున మీరు మీ పొరుగువారితోను మరియు మీకు తెలియని వారితోను మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.

మన భారతదేశ కుటుంబ వ్యవస్థలో ఆడవారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎట్లనగా ఒక కుటుంబాన్ని  నిలబెట్టాలి అన్నా లేక ఒక కుటుంబాన్ని పడదోయాలి అన్నా ఆడవారికే సాధ్యమవుతుంది. ఎందుకంటే చరిత్రలో గొప్ప గొప్ప యుద్ధాలు మరియు  పెద్ద పెద్ద మార్పులు అన్ని కూడాను ఆడవారి మూలంగానే జరిగినాయి.


 పైన తెలిపినటువంటి విషయాలన్నీ కూడాను మీరు కానీ పాటిస్తే మీ భర్త ఎల్లప్పుడు కూడాను మిమ్మల్ని విడువడు, ఎప్పుడు కూడాను మీ కొంగు పట్టుకొని తిరుగుతాడు.


Post a Comment

0Comments
Post a Comment (0)