మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా ? ఒక్కసారి దీన్ని చదవండి

KV Health Tips
0

 నేటి సమాజంలో ఆత్మహత్యలు సర్వసాధారణమైపోయాయి, చిన్న చిన్న విషయాలకు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు , ముందు వెనక ఆలోచించకుండా తమ తల్లిదండ్రుల గురించి మరియు తమని నమ్ముకున్న తమ వారి గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారు ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం సరైనదా కాదా అని ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం.


మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా,ఆరోగ్యం ఆనందం సంపద,ఆత్మహత్య,మనోధర్యం


చాలామంది చాలా చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు వారిలో కొందరు తాము ప్రేమించిన అమ్మాయి లేక అబ్బాయి , వేరే వారిని పెళ్లి చేసుకున్నారని తమను పెళ్లి చేసుకోలేదని మోసం చేశారని ఈ ఆత్మహత్యలకు  పాల్పడుతూ ఉంటారు, కానీ ఇది ఎంతవరకు న్యాయం మరియు ఎంతవరకు సమంజసం అని  ఒక్కసారి మీరు ఆలోచించండి, మిమ్మల్ని నమ్ముకొని మీ మీదే ప్రాణం పెట్టుకున్న మీ తల్లిదండ్రులు మీరు ఆత్మహత్య చేసుకున్న క్షణాన వారి పరిస్థితి ఏమిటి వారు ఈ లోకంలో మీరు లేకుండా ఉండగలరా అని ఒక్కసారి ఆలోచించండి , ఎవరో నిన్నకాక మొన్న పరిచయమైన అమ్మాయి లేక అబ్బాయి కోసం, మీ మీదే ప్రాణం పెట్టుకున్న మీ తల్లిదండ్రుల గురించి మీరు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి అప్పుడే మీకు తెలుస్తుంది మీరు చేసేది తప్ప ఉప్ప అని.

మరి కొంతమంది చదువుకునే పిల్లలు తాము పరీక్షల్లో పాస్ కాలేదని, మేము దేనికి పనికిరామని, పాస్ కాలేదన్న విషయం తమ అమ్మా నాన్నకు తెలిస్తే వారు ఎక్కడ కోప్పడతారు అని, భయంతో మరియు బాధతో తాము దేనికి పనికి రాము అని మానసికంగా కుంగిపోయి తొందరపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అలాంటివారు ఒక్కసారి ఆలోచించండి పరీక్షల్లో తప్పితే ఈసారి కాకపోతే మరోసారి పాస్ కావచ్చు కానీ జీవితమే పోతే మిమ్మల్ని నమ్ముకొని మీ మీదే ప్రాణం పెట్టుకున్న మీ తల్లిదండ్రులు పరిస్థితి ఏమిటి, నువ్వు లేకుండా ఉండగలరా ఒక్కసారి ఆలోచించండి, పరీక్షల్లో తప్పినప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు ఒక్కసారి మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించండి ఎందువల్ల తాము పరీక్షల్లో పాస్ కాలేదు అని ఒక్కసారి కూర్చుని ఆలోచించుకోండి, అలాగే మరి మీరు పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ముందు గతంలో మీరు చేసినటువంటి తప్పులను మరలా చెయ్యకుండా జాగ్రత్తగా ఒక  టైం టేబుల్ ప్రకారం ప్రిపేర్ అయితే విజయం మీదే.


కొంతమంది వ్యక్తులు ఎంతో బాగా ఉన్నత చదువులు చదువుతారు, కానీ వారికి తగినటువంటి ఉపాధి అవకాశాలు దొరకక తమ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను హ్యాండిల్ చేయలేక ,తాము దేనికి పనికిరామని మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటారు , వారు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ లోకంలో ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదువుకున్నవారు ఉన్నారు వారిలో ఎంతమంది వారు చదివిన చదువుకి సంబంధించి ఉద్యోగం చేస్తున్నారు అని ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరికి కూడాను గవర్నమెంట్ ఉద్యోగం రాదు ప్రతి  ఒక్కరు కూడాను వారు అనుకున్న ఉన్నతమైన పొజిషన్లో వారు ఉండరు, మీకు మీ తల్లిదండ్రులు ఉన్నతమైనటువంటి చదువులు చెప్పించారు వారిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత అంతేకానీ క్షణికావేసానికి పోయి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.

ఈ ఉద్యోగం కాకపోతే మరియొక్క ఉద్యోగం అంతేకానీ జీవితమే పోతే ఎలా! ఒక్కసారి ఆలోచించండి మీ ప్రాణం పోతే మరలా తిరిగి రాదు.

జీవితంలో ఎత్తు పల్లాలు సహజం ఏ ఒక్కరికి కూడాను జీవితం మొత్తం కూడాను సంతోషం ఉండదు అలాగే బాధ కూడా ఉండదు కొన్ని రోజులవరకే మీకు ఏ కష్టమైనా. కొంతమంది తాము ఆర్థికంగా చితికి పోయామని, అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నామని, పిల్లల భవిష్యత్తు ఏమిటి అని, ఎంతో బాధపడుతూ మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ  ఉంటారు, ఇలాంటివారు ఒక్కసారి ఆలోచించుకోండి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడాను అప్పులు ఉన్నాయి, ఈరోజు నీ పరిస్థితి దయనీయంగా ఉండవచ్చు కానీ ఓపికతో విశ్రాంతి లేకుండా నీ ప్రయత్నం నీవు చేస్తే తప్పకుండా  ఈ పరిస్థితి నుంచి మీరు బయటపడ వచ్చు, కాకపోతే ఓపికతో సమయం కోసం ఎదురుచూస్తూ మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి ,విజయం తప్పనిసరిగా మీ ముందు  ఉంటుంది మీ పరిస్థితి మారుతుంది, నమ్మండి, నమ్మకంతో మీ ముందున్న పనిని మీ శక్తివంచన లేకుండా చేయండి, అప్పుడు పరిస్థితి మారుతుంది. అంతేకానీ తొందరపడి  నిర్ణయం తీసుకొని ఆత్మహత్యలకు పాల్పడకండి జీవితం చాలా గొప్పది మరియు చాలా విలువైనది.

కొంతమంది అయితే తమ పిల్లలు తమకి ఇష్టం లేకుండా వేరే వారిని వివాహం చేసుకున్నారని, తమకి ఇష్టం లేని మార్గంలో తమ పిల్లలు వెళ్తున్నారని, ఇలా ఏవేవో కారణాలతో కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఇది ఎంతవరకు సమంజసము మీరు ఒక్కసారి ఆలోచించండి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత మీ పిల్లలను సన్మార్గంలో నడిపించడం మరియు వారికి ఇష్టమైనవి ఏమైనా ఉంటే ఒక్కసారి వారి పక్షమున ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి, మీ పిల్లలకు ఇష్టమైన కోరిక సరైనదా కాదా అని, అంతేకానీ మీకు ఇష్టం లేని పని చేశారని మీరు ఆత్మహత్య చేసుకోవడం లేక మీ పిల్లలను  పరువు పేరుతో హత్య చేయడము ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి.

 కొంతమంది అంటూ ఉంటారు  ఒడ్డున ఉండి ఎన్ని అయినా చెపుతారు లోతులో ఉన్నవారికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో అని అంటూ ఉంటారు,  అది నిజమే కానీ అదే బాధ అదే లోతు శాశ్వతం కాదు కదా జీవితంలో ఎత్తు పల్లాలు సహజం ఈ రెండిటిని సమానంగా చూస్తేనే మనం జీవితంలో ముందుకు వెళ్లగలం, అంతేకానీ చిన్న చిన్న వాటికి మొత్తం ప్రపంచం అంతా కూడాను తలకిందులు అయిపోయింది అన్నట్లుగా మన జీవితాన్ని ముగించుకోకూడదు, దేవుడు మనకి ఎంతో అమూల్యమైన ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడు , ఇలాంటి జన్మను మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాము అని ఆలోచించుకోండి అంతేకానీ మధ్యలోనే   మీ తనువు చాలించవద్దు.


 మీరు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మిమ్మల్ని నమ్ముకున్న మీ తల్లిదండ్రుల గురించి, మీ భార్యాబిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించుకోండి, అప్పుడే తెలుస్తుంది మీరు చేస్తుంది తప్ప ఉప్పని...



Post a Comment

0Comments
Post a Comment (0)