గర్భంతో ఉన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ శారీరకంగా కలవచ్చా? ఒకవేళ శారీరకంగా కలిస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? శారీరిక కలయిక గర్భంతో ఉన్నప్పుడు ఏ సమయంలో పాల్గొనాలి మరియు ఇద్దరూ ఎలా పాల్గొనాలి ? అని అనేకమంది దంపతులకు ఇలాంటి ప్రశ్నలు అనేకం ఎదురవుతూ ఉంటాయి, వీటన్నిటికీ సమాధానం ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకుందాం.
చాలామంది దంపతులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేటువంటి ఒకే ఒక్క విషయం ఏమిటి అంటే అది వారికి పుట్టబోయేటువంటి పిల్లల కోసం, అలాంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా శారీరకంగా కలవచ్చా, లేదా అని చాలా మంది ఎన్నో ఆలోచనలు మరియు ఎన్నో అపోహల్తో ఉంటారు, ఇలాంటివారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి , భార్యాభర్తలిద్దరూ కూడాను తగు జాగ్రత్తలు తీసుకొని శారీరకంగా కలవచ్చు, అయితే మీరు కచ్చితంగా మీ డాక్టర్ యొక్క సలహా మేరకు పాల్గొనడం మంచిది.
గర్భంతో ఉన్న స్త్రీ తన భర్తతో శారీరికంగా కలిసే ముందు భర్త యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అని ఒక్కసారి పరీక్షించుకోని పాల్గొనడం మంచిది, ఎందుకంటే మగవారికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి వారు కలిసినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ గర్భంలో ఉన్న శిశువుకు వచ్చే ప్రమాదం ఉంది కావున ప్రతి పురుషుడు కూడాను మన భార్యతో కలిసే ముందు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తీసుకొని కలవడం మంచిది.
హై రిస్క్ ప్రెగ్నెన్సీ వారు శారీరకంగా కలవకపోవడం మంచిది ఎందుకంటే వారి యొక్క గర్భస్థ శిశువు యొక్క పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి, వారు ఒకవేళ పాల్గొనాలి అని అనుకుంటే వారి యొక్క డాక్టర్ ని సంప్రదించి వారు సూచించేటువంటి మార్గాల ద్వారా వెళ్లడం మంచిది, ఒకవేళ మీరు కానీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ పరిస్థితుల్లో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టుగా శారీరకంగా కలవొద్దు ఎందుకంటే అది మీ కడుపులో ఉన్న బిడ్డ యొక్క ప్రాణాలకి మరియు మీ ప్రాణాలకి కూడాను ప్రమాదమే. కావున మీ డాక్టర్ ని కలుసుకుని మరియు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ముందుకు వెళ్లడం మంచిది.
మీరు కానీ గర్భంతో ఉన్నప్పుడు శారీరకంగా కలవాలి అని అనుకుంటే మీ యొక్క బరువు బిడ్డ మీద అనగా కడుపు మీద పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పాల్గొనడం మంచిది అంతేకాదు మీరు కలిసే ముందు మీ డాక్టర్ యొక్క సలహాలు మరియు సూచనలు మేరకే మీరు పాల్గొనాలి, ఆ సమయంలో ఒక్కడు మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి ఎట్టి పరిస్థితులను కడుపు మీద బరువు మాత్రం పడనీయకండి.
గర్భం ధరించిన మొదటి రోజుల్లో అనగా మొదటి ఐదు నెలల లోపు శారీరకంగా కలిస్తే గర్భస్రావం అవుతుంది అని చాలామంది అనుకుంటారు, మరియు నెలలు నిండకుండానే ముందుగానే ప్రసవం అవుతుంది అని కొందరు అనుకుంటారు, కానీ ఇది వాస్తవం కాదు గర్భం ధరించాక ముందు రోజుల్లో కూడాను శారీరకంగా కలవచ్చు, కానీ ఆ మహిళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది , ఆ మహిళకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా అని ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి వారి సలహా మేరకు మాత్రమే శారీరకంగా కలవటం మంచిది, ఇది కూడాను ఎన్ని రోజులు పాల్గొనాలి అనగా వారికి ప్రసవం అయ్యేదాకా పాల్గొనాలా అనేది వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది, ఏది ఏమైనా కానీ ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి ముందుకు వెళ్లడం మంచిది.
భార్య గర్భం ధరించినప్పుడు శారీరకంగా కలవటం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి అవి ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం.
మొదటిగా గర్భంతో ఉన్నప్పుడు శారీరకంగా కలవటం వల్ల గర్భస్థ ముఖ ద్వారం తెచ్చుకొని నార్మల్ డెలివరీ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి.
రెండవదిగా స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు శారీరకంగా కలవటం వల్ల తన యొక్క శరీరానికి ఎక్ససైజ్ అయ్యి శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గి శరీరం మంచి ఉత్సాహంగా అవుతుంది.
మూడవదిగా ఇలా శారీరకంగా కలవటం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ రెట్టింపు అవుతుంది, ఎందుకంటే సాధారణంగా ఈ సమయంలో పురుషులు తమ భార్యలతో సాధారణ రోజుల వలె శారీరకంగా కలవటం కుదరదు కాబట్టి వారు వేరే మార్గాలలో వెళ్లే ప్రమాదం ఉంది . కావున ఈ సమయంలో స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి శారీరకంగా కలవటం మంచిది.
ఇలాంటి స్త్రీలు మాత్రం గర్భంతో ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను తమ భర్తతో శారీరికంగా కలవకూడదు వారు ఎవరు అనగా, హై రిస్క్ ప్రెగ్నెన్సీ మహిళలు మరియు పొత్తికడుపు కిందకు ఉన్నవారు, ఉమ్మనీరు పడుతున్న వారు మరియు కొంతమందికి గర్భస్థ ముఖ ద్వారం నుంచి వైట్ వస్తుంది ఇలాంటివారు కూడాను గర్భంతో ఉన్నప్పుడు శారీరిక కలయిక లో పాల్గొనకూడదు.
ఏది ఏమైనా కానీ శారీరకంగా కలవటం, శారీరకంగా కలవకపోవడం అనేది ఆ మహిళ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది, అదేవిధంగా డాక్టర్ని సంప్రదించి వారి యొక్క సలహా మరియు సూచనలు మేరకు ముందుకు వెళ్లడం మంచిది, మీకు గనక ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా మీయొక్క డాక్టర్ని సంప్రదించి వారి సలహాలు పాటించడం మంచిది.