మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి

KV Health Tips
0

చాలామంది అంటూ ఉంటారు సంతోషంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని, దీనికి సమాధానం మీ మీదే ఆధారపడి ఉంటుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.


మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి,ఆరోగ్యం ఆనందం సంపద,సంతోషం,సంతోషం ఎలా పొందాలి


 కొన్ని విషయాలు కనుక మన పరిశీలించి గ్రహించినట్లయితే మనం ఎల్లప్పుడూ కూడాను సంతోషంగా ఉంటాం అవి ఏమిటి అంటే మొదటిగా మీరు  మీ తోటి వారితో ఎప్పుడు కూడాను కంపేర్ చేసుకోకండి ఇలా పోల్చుకోవడం మూలంగా మీరు మానసికంగానూ  శారీరకంగానూ కుంగిపోతారు, ఏదో పక్కవాడికి మంచి జాబ్ వచ్చిందని అలాగే వాడు వ్యాపారంలో ముందంజలో ఉన్నాడు అని , అలా నేను ఎందుకు ఉండలేదు అని వారితో మనం   పోల్చుకుంటూ ఉంటాం, ఎప్పుడు కూడాను ఇలా చేయకూడదు ఎందుకంటే మీకు తెలియకుండానే  మీ పక్క వారి జీవితంలో  ఎన్నో అగాధాలు, బాధలు ఉండవచ్చు, వారి జీవితం వారిది, వారితో మీరు ఎప్పుడు కూడాను పోల్చుకోకూడదు.

మీకున్నటువంటి వృత్తిలో మీరు నమ్మకంతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా ఈరోజు కాకపోవచ్చు   రేపైనా    వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఎప్పుడు కూడాను నమ్మకం కోల్పోకుండా మీ చేతిలో ఉన్న పనిని మీ శక్తివంచన లేకుండా చేయండి.


 రెండవదిగా చాలామంది వారికి  ఏదైనా  సమస్య వస్తే అది చిన్న సమస్య అయినా కానీ ఏదో జరిగిపోయింది, ఈ ప్రపంచం మొత్తం కూడాను నాకు వ్యతిరేకంగా ఉంది అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు , ఇలా ఓవర్ గా ఆలోచించడం వల్ల మీ సమస్య తీరకపోగా ఇంకా లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, కావున మీకు ఏమైనా సమస్య వస్తే మొదటిగా ప్రశాంతంగా కూర్చుని దీన్ని ఎలా చేస్తే సమస్య తీరుతుంది అని ఆలోచించుకోవాలి అంతేకానీ ఓవర్ థింకింగ్ ఎప్పుడు చేయకూడదు, ఇలా చేయడం వల్ల మీరు మానసికంగా  కుంగిపోతారు దీనివలన ఎప్పటికీ మీకు ఆనందం కలగదు.


మీరు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి,ఆరోగ్యం ఆనందం సంపద,సంతోషం,సంతోషం ఎలా పొందాలి


మూడవదిగా మీరు మాట్లాడే మాట మరియు చేసే పని సరిగ్గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే మనం నలుగురిలోనికి వెళ్ళినప్పుడు మనం మాట్లాడే తీరును బట్టి మనకు గౌరవం కానీ ,సహాయం కానీ దొరుకుతుంది, శరీరంలో నాలుక చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే ఈ సమాజంలో  మనం నవ్వాలన్నా ,బాధపడాలన్న ఈ నాలుక యొక్క మాట మీద ఆధారపడి ఉంటుంది, కావున ప్రతి ఒక్కరు కూడాను మీ పొరుగువారితో మాట్లాడేటప్పుడు మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీ ప్రవర్తన కూడానా జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు సరిగ్గా లేకపోతే మీ పొరుగువారితో లేనిపోని గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి వీటి ద్వారా మీ యొక్క సంతోషం దూరమవుతూ ఉంటుంది, అందుకే మన పెద్దవారు అంటూ ఉంటారు మీ మాట జాగ్రత్త అని...

నాలుగవదిగా మీ కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే ముందుగా మీరు ఆ సమస్యను ఎలా స్వీకరిస్తున్నారు  అని దానిపైన కూడాను మీ యొక్క  సంతోషం ఆధారపడి ఉంటుంది. మీకు మీ కుటుంబం ద్వారా ఏమైనా సమస్య వస్తే ముందుగా మీరు చేయవలసిందల్లా మీ కుటుంబ సభ్యులు అందరితో కూర్చొని వారితో  సంప్రదించి ఏం చేస్తే ఈ సమస్య తీరుతుంది అని ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా అది మీ సంతోషాన్ని  ఎప్పుడు దూరం చేయదు మరియు మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధం బాంధవ్యాలు ఇంకా మెరుగుపడతాయి, ఇలా చేయడం ద్వారా మీకు గాని బయట ఏ సమస్య వచ్చినా కానీ మీ కుటుంబం మీకు అండగా ఉంటుంది, మరియు మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.


ఇవే కాకుండా మీరు మనశ్శాంతిగా మరియు సంతోషంగా ఉండాలి అంటే, కొంత సమయం పాటు లేదా కొన్ని రోజులపాటు ఎక్కడికైనా విహారయాత్రలకు వెళ్లడం మంచిది లేదా మీరు కానీ పల్లెటూరు వాతావరణం దగ్గరలో ఉంటే, ఆ వాతావరణం లో మీరు ఏకాంతముగా కొంత సమయం గడిపిన కూడాను మీరు మనశ్శాంతిని ,సంతోషాన్ని పొందుతారు. అంతేకానీ మద్యపానానికి మరియు ధూపనానికి  అలవాటు  అవ్వటం వల్ల మీకు ఉన్న సమస్యలు తీరకపోగా లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి, మద్యపానం అనేది ఆ సమయానికి మీకున్న సమస్యను మర్చిపోయేలా చేస్తుంది కానీ, మీ సమస్యను మాత్రం శాశ్వతంగా తీర్చదు మరియు దీనికి తోడు  మరికొన్ని కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది, కావున ఏ ఒక్కరు కూడాను వీడికి మాత్రం  బానిసలు అవ్వకండి.


పైన తెలిపినటువంటి విషయాలే కాకుండా మరికొన్ని  పద్ధతులు కూడాను మీరు సంతోషంగా ఆనందంగా ఉంటానికి ఉపయోగపడతాయి అవి ఏమిటి అంటే.

  మీకు ఏదైనా సమస్య వస్తే మీ కుటుంబంతో ఆ సమస్యను  పంచుకొని మీ కుటుంబంతో సమయాన్ని గడపండి.


  దైవ దర్శనాలు చెయ్యండి ఇలా చేయడం వల్ల కూడాను మీరు సంతోషాన్ని పొందుతారు.


 మీ ప్రాణ స్నేహితులతో కొంత సమయాన్ని కేటాయించండి దీనివలన కూడాను మీ సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు, మరియు మీరు సంతోషాన్ని ,మనశ్శాంతిని పొందుకోవచ్చు.

 ఏది ఏమైనా కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి సంతోషమనేది ఎవరో ఇస్తేనే కానీ వచ్చేది కాదు అది మన యొక్క  ఆలోచన సరళి పైన మరియు ఏ సమస్య వచ్చినా కానీ మనం తీసుకునేటువంటి నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది, కావున ప్రతి ఒక్కరు కూడాను సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడకుండా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్లడం ద్వారా మనశ్శాంతిని పొందుతారు, మరియు మీ పక్క వారితో ఎప్పుడు కూడాను  పోల్చుకోకండి, మీ యొక్క సంతోషం దూరం అవడానికి ఇది మొదటి కారణంగా కూడా చెప్పవచ్చ....



Post a Comment

0Comments
Post a Comment (0)