చాలామంది తమ భార్యలతో లేదా తమ భాగస్వామితో ఎక్కువసేపు శృంగారం చేయలేకపోతున్నాం అని చాలా మదన పడుతూ ఉంటారు. వీటన్నిటి సమాధానం ఇప్పుడు మనం ఎక్కడ చూద్దాం.
మన భారత దేశంలో చాలామంది యొక్క అభిప్రాయం ఏమిటంటే శృంగారం అనేది ఒక చెడు పదం అని, దాన్ని ఎక్కడ పడితే అక్కడ తరచుగా ఆ పదం ఉపయోగించకూడదు అని, అది ఒక పెద్ద బూతు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు, కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవలసిన అతి ముఖ్యమైనటువంటి విషయాలలో ఈ శృంగారం కూడా ఉంటుంది . ఎందుకంటే దీని గురించి సరైన అవగాహన లేక చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, చాలామంది పెళ్లి అయినటువంటి భార్యాభర్తలు సరేనా అటువంటి అవగాహన లేక వారి కుటుంబ వ్యవస్థను వారి పాడు చేసుకుంటున్నారు, కొంతమంది ఆడవారు మరియు మగవారు అశ్లీల చిత్రాలు చూస్తూ తమ పార్ట్నర్ తో ఆ విధంగా శృంగారం చేయలేకపోతున్నామే మరియు అంతసేపు చేయలేకపోతున్నామే అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ అది చాలా తప్పు ఎందుకంటే నిజ జీవితం వేరు ఆ నీలి చిత్రాలలో నటించేటువంటి సన్నివేశం వేరు, ఎప్పుడు కూడాను మన భార్య లేక భర్తతో చేసేటువంటి శృంగార ని ఆ అశ్లీల చిత్రాలతో పోల్చుకోకూడదు, వారిలాగా మనం చేయలేకపోతున్నామే మరియు వారు చేసేటువంటి భంగిమలలో మనం చేయలేకపోతున్నామే అని ఎప్పుడు కూడాను వాటితో మీరు పోల్చుకోకూడదు, ఇలా పోల్చుకోవటం వల్ల మీ మీద మీకే అనగా మీ సామర్థ్యం మీద మీకే నమ్మకం పోతుంది మరియు దీని గురించి మీరు తీవ్రంగా ఆలోచించడం వల్ల నిజంగానే మీ యొక్క సామర్థ్యం తగ్గుతుంది.
మీ యొక్క శృంగారం సామర్థ్యం పెంచుకోవాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఈ అశ్లీల చిత్రాలను చూడటం మానివేయాలి, మరియు వాటిలోని క్యారెక్టర్స్ తో మీయొక్క పార్ట్నర్ ని పోల్చుకోవడం గాని ఊహించుకోవడం గాని మానివేయాలి, ఈ నీలి చిత్రాలను చూసేటువంటి అలవాటు వల్ల మీ శృంగార సామర్థ్యం తగ్గుతుంది అంతే కాకుండా మీ ప్రవర్తన మీద మరియు మీ కుటుంబం మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది.
చాలామంది యొక్క సమస్య ఏమిటి అంటే వారు శృంగారం చేసే సమయంలో వారికి శీఘ్రస్కలనం అవుతుంది అంటే వారికి తొందరగా స్కలనం అవుతుంది ఇలాంటివారు శృంగారం లో పాల్గొనే రెండు నుంచి మూడు గంటల ముందు వారు గనక "స్వయం సంతృప్తి" పొంది శృంగారంలో పాల్గొంటే వారికి ఈ శీఘ్ర స్కలనం సమస్య నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు, మేము చెప్పింది చదవటానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న కానీ ఇది వాస్తవం.
శృంగారంలో అతి ముఖ్యమైనది "ముందు ఆట" కానీ చాలామంది దీన్ని చేయకుండా కార్యంలోనికి వెళ్తారు, ఇలా చేయడం వల్ల ఆడవారు సంతృప్తి పొందకపోగా మీ యొక్క సామర్థ్యం కూడాను తగ్గుతుంది, ప్రస్తుత రోజుల్లో చాలామందికి ఈ "ముందు ఆట" గురించి సరైన అవగాహన లేక తమ సంసార సుఖాన్ని పాడు చేసుకుంటున్నారు, శృంగారం చేయటానికి మగవారు ఎంత సంసిద్ధంగా ఉంటారో అలాగే ఆడవారు కూడాను ఉండాలి ,ఇలా ఉండాలి అంటే ఈ "ముందు ఆట" చాలా ముఖ్యం, ఎందుకంటే ఆడవారిలో శృంగార కోరికలు రావడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ "ముందు ఆట" చేయడం వల్ల వారు త్వరగా ఈ అనుభూతిని పొందుతారు.
శృంగారం లో సువాసన అనేది చాలా ముఖ్యం ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది, ప్రతి ఆడవారిలోనూ అలాగే ప్రతి మగవారిలోనూ ఒక్కో సువాసన ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనది, మీరు మీ పార్ట్నర్ తో శృంగారంలో కలిసే ముందు మీయొక్క శరీర తత్వాన్ని ఒక్కసారి పరీక్షించి చూసుకోండి, ఇలా చేయడం ద్వారా మీలో గనక ఈ సువాసన అనేది సరిగ్గా లేకపోతే మీ భాగస్వామితో మీకు ఇబ్బంది రావచ్చు. ఈ సువాసన అనేది మీ శృంగారంపై ఎక్కువ ప్రభావితం అవుతుంది ఇది ఎంత మంచిగా ఉంటే మీరు అంత సేపు మీ భాగస్వామితో సంసార సుఖాన్ని పొందుతారు.
వీటితోపాటు మీరు గాని ఎక్కువసేపు శృంగారం చేయాలి అంటే మీ యొక్క శరీరం మీద మీకు నియంత్రణ శక్తి ఉండాలి, అంటే మీరు శృంగారం చేసేటప్పుడు స్టాప్ అండ్ స్క్రీజ్ ఈ పద్ధతిని ఉపయోగించడం ద్వారా కూడాను మీరు మంచి ఫలితాలను పొందుకుంటారు, అన్ని మార్గాలలో కంటే కూడాను ఈ స్టాఫ్ అండ్ స్క్రీజ్ పద్ధతి చాలా శ్రేష్టము మరియు మంచి ఫలితాన్ని ఇస్తుంది, ఈ పద్ధతి కనుక మీరు అలవాటు చేసుకోగలిగితే, మీరు ఎంత సమయం అయినా కానీ శృంగారంలో అలాగే ఉంటారు.
మీరు ఎక్కువ సేపు శృంగారం చేయాలి అంటే, మీ ఆహారపు అలవాట్ల మీద మరియు మీ వ్యసనాలపై కూడాను ఆధారపడి ఉంటుంది, ఎప్పుడు కూడాను శృంగారం చేసే ముందు భోజనం సంతృప్తిగా తినకూడదు, కొంచెం వెలితిగానే తినాలి, మీరు కానీ సంతృప్తిగా భోజనం చేసినట్లయితే మీరు శృంగారం చేసే సమయంలో చాలా ఇబ్బంది పడతారు. మరియు మీరు మద్యపానం ధూమపానం మానేయాలి ఇవి రెండు కూడా మీ యొక్క సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి, మరియు దీనివల్ల మీ కుటుంబ వ్యవస్థ కూడాను విచ్ఛిన్నమవుతుంది కావున వీడి జోలికి మాత్రం అసలు వెళ్లొద్దు.
వీటితోపాటు యోగ మరియు వ్యాయామం చేయడం ద్వారా కూడాను మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. వీటితోపాటు వయాగ్రా వంటి కొన్ని మందులు కూడాను మీ యొక్క శృంగార సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడతాయి కానీ వీటి వాడకం కొన్ని దుష్ప్రభావాలకు లోను కావచ్చు కాబట్టి వీటిని వాడే ముందు మీ యొక్క డాక్టర్ని సంప్రదించి వారి సూచనల మేరకు ఈ సప్లిమెంట్స్ ని వాడాలి..
అన్నిటికంటే అసలు ముందు మీ భార్యతో మీ సాంగత్యాన్ని సరి చూసుకోండి ఆమెతో మీరు ఎంత సున్నితంగా మెలిగితే మీ యొక్క శృంగారం అంత మధురంగా ఉంటుంది....