భార్య లేక భర్త వారి యొక్క శృంగారభరితమైన సమయాన్ని సెట్ చేయడం అనేది వారి మధ్య ఉన్నటువంటి సన్నిహిత్యం మీద ఆధారపడి ఉంటుంది. భార్య భర్తల శృంగారభరితమైన సమయాన్ని సెట్ చేయడానికి ఇక్కడ కొన్ని పద్ధతులు వివరించడం జరుగుతుంది అవి ఏంటో ఇక్కడ చూద్దాం.
చాలామందికి పెళ్లయిన కొత్తల్లో చాలా జంకు మరియు బిడియం ఉంటాయి, దీనివల్ల వారు తమ యొక్క భావాలను ,కోరికలను తమ భర్తతో పంచుకోవడానికి భయపడుతూ ఉంటారు, మరియు అంతేగాక పెళ్లయిన కొత్తలో తమ అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఆడవారు కూడాను కొంత భయంతో ఉంటారు కారణం అప్పటిదాకా తమ తల్లిదండ్రులతో మరియు కుటుంబ సభ్యులతో చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగినవారు సడన్గా పెళ్లి అనే పేరుతో వేరే ఇంటికి రావడంతో వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో అని చెప్పి చాలామంది ఆడవారు భయపడుతూ ఉంటారు, మరియు వీరు తమ ఆశలను కోరికలను తమ భర్తతో వ్యక్తపరచడానికి జంగుతూ ఉంటారు.
కొంతమంది మగవారికి కూడాను ఇలాంటి ఆలోచన ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆడవారే తమ భర్తని అర్థం చేసుకొని వారితో సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నం చేయాలి, మీరు మీ భర్త యొక్క ప్రేమను పొందాలి అంటే మొదటిగా అతని యొక్క ఆలోచన సరళి ఎలా ఉంది అని ముందుగా ఒక అంచనాకి రావాలి.
మీరు మీ భర్త యొక్క ప్రతి చిన్న విషయంలో కూడాను అతనికి తోడుగా ఉండండి అది ఆఫీసుకి సంబంధించిన విషయం అయినా సరే, అతను వచ్చిన తర్వాత అతనితో సాఫీగా మాట్లాడటం ద్వారా మీ భర్త యొక్క భావాలను మీరు అర్థం చేసుకోగలుగుతారు, ఎప్పుడు కూడాను గొడవగా మాట్లాడకుండా ఎంతో ప్రేమతో,ఆప్యాయతతో మాట్లాడటం నేర్చుకోండి.
మీ భర్తకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను మీరే స్వయంగా వండి అతనికి తినిపించడం ద్వారా మీ భర్త యొక్క ప్రేమను పొందుతారు, అంతేకాకుండా మీ భర్త భోజనం చేసే సమయంలో అతని పక్కనే కూర్చుని అతనికి ప్రేమతో మీరు భోజనం వడ్డించడం ద్వారా మీ భర్త యొక్క ప్రేమను పొందగలుగుతారు.
ఇవే కాక భార్య భర్తలు ఇరువురు కూడాను కలిసి సినిమాలకి వెళ్ళటం మరియు కలిసి డిన్నర్ చేయడం వంటి ద్వారా కూడాను మీ భర్త యొక్క ప్రేమను పొంది వారిని శృంగారభరితమైన సమయం లోనికి తీసుకురని రావచ్చు.
సాధ్యమైతే కొన్ని రోజులు మీరు ఏకాంతంగా అవుట్ డోర్ కి వెళ్లి రావటం మంచిది, ఇలా చేయడం ద్వారా మీ యొక్క భావాలు మీ భర్తకు మరియు మీ భర్త యొక్క ఆలోచనలు మీకు తెలుస్తాయి, అంతేకాక మీ యొక్క బంధం కూడాను బలంగా ఉంటుంది.
కొన్నిసార్లు మీ భర్తను మీరు ముట్టుకోవటం, కౌగిలించుకోవడం మరియు ముద్దు పెట్టుకోవడం వంటి చర్యల ద్వారా కూడాను మీ భర్తలో శృంగారభరితమైన భావజాలాన్ని ప్రేరేపించడానికి చాలావరకు సహాయపడతాయి. ఇవే కాక మీరు ఉండేటువంటి పరిసరాలు కూడాను మీ యొక్క శృంగార సన్నిహిత్యం మీద ప్రభావం చూపుతాయి, ఎప్పుడు కూడాను మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా మరియు ఆరోగ్యకరంగా ఉండేటట్టు చేసుకోండి, ప్రతిరోజు కూడాను రాత్రి సమయంలోనే కాకుండా పగటి సమయంలో కూడాను మీరు ఏకాంతంగా గడపడానికి సమయాన్ని కేటాయించుకోండి, ఇలా చేయడం ద్వారా మీ బంధం చాలా బలపడుతుంది, మీరు ఏకాంతంగా గడిపే సమయంలో ఎప్పుడు కూడాను లైట్ గా వెలుతురు ఉండేటట్టు చూసుకోండి ఇలాంటి లైట్ నైట్ మీ భాగస్వామికి ఎంతో ఉత్సాహాన్ని మరియు శృంగారభరితమైన ఆలోచనల్ని కలుగచేస్తాయి.
కమ్మనైన సువాసన కూడాను మీ భర్తలో శృంగారభరితమైన ఆలోచనలు కలుగచేస్తాయి కావున మీరు మీ పడక గదిలో సువాసన వెదజల్లే వస్తువులకు లేదా పదార్థాలకు మొదటిగా ప్రాధాన్యత ఇవ్వండి, మరియు మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మీ యొక్క భావాలు, కోర్కెలు అన్నిటి గురించి మీ భర్తతో సంభాషించండి ఇలా చేయడం ద్వారా మీ భర్త కూడాను తన యొక్క ఆలోచనలను మీతో పంచుకోవడం జరుగుతుంది ఈ విధంగా మీ వివాహ బంధం ఎంతో ఆనందంగా ,సంతోషంగా ఉంటుంది.
ఆహ్లాదకరమైనటువంటి మంచి సంగీతంతో మీ భర్తని శృంగారభరితమైన కార్యాలలోనికి ప్రేరేపించవచ్చు, వీలైతే మంచి సంగీతంతో మీ ఇరువురు కూడాను డాన్స్ చేయటం ద్వారాను మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు, ఏది ఏమైనా కానీ వివాహం అనేది ఎంతో అమూల్యమైనది దానిని మనం ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని, ఒకరి ఆలోచనలు తగినట్టుగా మరి ఒకరు నడుచుకొని తమ జీవితాలను ఎంతో సంతోషంగాను మరియు స్వర్గపరితంగాను చేసుకోవచ్చు.