భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైంది వీరు ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఎంతో ప్రేమతోను మర్యాద తోను కలిసిమెలిసి జీవించాలి అప్పుడే ఆ బంధం నిలబడుతుంది,
భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైంది వీరు ఒకరి ఎడల ఒకరు నమ్మకం కలిగి ఎంతో ప్రేమతోను మర్యాద తోను కలిసిమెలిసి జీవించాలి అప్పుడే ఆ బంధం నిలబడుతుంది, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే మనస్తత్వం ఇద్దరిలో కూడాను ఎప్పుడు కూడాను ఉండకూడదు, ఒకవేళ ఇలాంటి ఆలోచన కనుక వస్తే వారి జీవితం అస్తవ్యస్తమవుతుంది, మగవారు తమకు కాబోయేటువంటి భార్య గురించి ఎంతో ఆత్రుతగా మరియు ఉన్నతంగా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఆలోచనలో తమ భార్య తమను ఎంతగానో ప్రేమగా చూసుకుంటుందని మరియు తన కుటుంబాన్ని కూడా అంతే ప్రేమగా చూసుకుంటుందని భావిస్తారు, అదేవిధంగా ఆడవారు కూడాను తమకు కాబోయేటువంటి భర్త గురించి అదేవిధంగా ఆలోచిస్తూ ఉంటారు, ఇలా ఆలోచించడం మంచిదే మరియు అందరూ కూడాను చేసే పని కానీ కొంతమంది ఈ మధురానుభూతిని ఆస్వాదించకుండా తమ వక్ర బుద్ధితో వారి జీవితాన్ని వారే పాడు చేసుకుంటూ మరియు కుటుంబాన్ని కూడా చిన్న విన్నం చేసుకుంటున్నారు, ఇక్కడ మనం ఎలాంటి అమ్మాయిని తమ జీవిత భాగస్వామిగా చేసుకుంటే వారి జీవితం బాగుంటుందో, ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే వారి జీవితం నాశనం అవుతుందో ఇక్కడ మనం తెలుసుకుందాం.
కొంతమంది స్త్రీలు ఎంతో గర్వంతోను అహంకారంతోను ఉంటారు ఇలాంటి వారిని గనుక మీరు మీ జీవిత భాగస్వామిగా చేసుకుంటే మీ జీవితం నాశనమే, ఎందుకంటే ఇలాంటివారు ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడాను తమదే పై చేయిగా ఉండాలని తమ మాటే అందరూ వినాలి అని అనుకుంటూ ఉంటారు, భర్త చెప్పినటువంటి ఏ మాటను కూడాను మీరు లెక్క చేయరు అంతేకాదు మీరు అత్తమామలను మరియు మిగిలిన కుటుంబ సభ్యులను కూడాను ఏ మాత్రం లెక్కచేయరు అంతా కూడాను తమ ఇష్టానుసారంగానే జరగాలి అనే మనస్తత్వంతో అహంకార భావంతో ఉంటారు, ఇలాంటి వీరు సమాజంలో కూడాను మీ యొక్క గౌరవాన్ని నిలబట్టకపోగా వీరే ఆ గౌరవాన్ని నాశనం చేస్తారు, భర్తనే మర్యాద కూడా లేకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కానీ మరియు ప్రవర్తించడం గానీ చేస్తారు, ఇలాంటి స్త్రీని కనుక మీరు గాని వివాహం చేసుకుంటే మీ జీవితం అంతే ఇంకా...
చెడు వ్యసనాలకు బానిసైనటువంటి స్త్రీలు, ఇలాంటి స్త్రీలు తమ జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా వీరితో పాటుగా కుటుంబాన్ని కూడాను నాశనం చేస్తారు, వీరి యొక్క చెడు ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, మద్యపానం మరియు ధూమపానం ఇలాంటి వాటికి బానిసవటము లేక వ్యభిచార క్రియలకు బానిసవటము లాంటివి చేస్తూ ఉంటారు, వీటికి బానిస అవడం వల్ల తమ కుటుంబాన్ని మరియు తమ భర్తని కూడాను సమాజంలో తల ఎత్తుకోకుండా చేస్తూ ఉంటారు , ప్రస్తుత సమాజంలో ఎంతోమంది స్త్రీలు ఆధునిక పోకడలకు బానిసలుగా మారి ఇదే వారి జీవితం అనుకొని చెడుదారులు, చెడు వ్యసనాలకు తమ జీవితంలో చోటు కల్పిస్తున్నారు, ఇలాంటి వారికి ప్రస్తుతం వీరేం చేస్తున్నారో మనం చెప్పిన కానీ వారు అర్థం చేసుకోరు చివరికి వారి జీవితం నాశనమైనప్పుడే తెలుస్తోంది, కాబట్టి మగవారు మీరు గాని వివాహం చేసుకునే ముందు ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన గురించి తెలుసుకొని వివాహం చేసుకోవడం మంచిది లేకపోతే, మీరు కూడాను ఇలాంటి వారి చేతుల్లో బలి కావాల్సి వస్తుంది మరియు మీ జీవితం నాశనం అవుతుంది.
సాధారణంగా ప్రతి కుటుంబంలో కూడాను స్త్రీలే మనీ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కుటుంబంలో ఏమి అవసరాలు ఉన్నాయో ఎలాంటివి కావాలో వీరికి తప్ప మరి ఎవరికీ కూడాను అంతగా తెలియకపోవచ్చు, మరి అంతే కాకుండా వీరు తమ భర్త కుటుంబ అవసరాల నిమిత్తం ఇచ్చినటువంటి డబ్బులో కొంత వీరు దాస్తూ ఉంటారు దీనికి కారణం కుటుంబంలో ఎప్పుడైనా కానీ అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఆ డబ్బే వీరికి అవసరం అవుతుంది, ఇలా చేయడం మంచిదే కానీ కొంతమంది స్త్రీలు ధనమే తమ జీవితం లాగా భావిస్తూ ఉంటారు, డబ్బుకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత మరి ఏ ఇతర కుటుంబ సభ్యులకు కానీ మరియు తమ భర్తకు కూడాను ఇవ్వరు. ఇలాంటి వారిని గనక మీరు గాని వివాహం చేసుకుంటే మీ డబ్బు పోతుంది దానితోపాటు మీ మనశ్శాంతి కూడా పోతుంది, కావున మీరు వివాహం చేసుకునే ముందు కాస్త ముందు వెనక ఆలోచించండి.
ఒక కుటుంబాన్ని కట్టాలన్న ఆడవారే అలాగే ఒక కుటుంబాన్ని నాశనం చేయాలన్న ఆడవారే, కాబట్టి స్త్రీలు తమ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి, భర్త మాటలు వింటూ, కుటుంబ జీవితానికి విలువనిస్తూ అందరితో కూడాను కలిసిమెలిసి తమ జీవితాన్ని సంతోషపరితం చేసుకోవాలి అంతేకానీ తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా కుటుంబాన్ని కూడా నాశనం చేయకూడదు, ఇదేవిధంగా మగవారు కూడాను తమ ప్రవర్తనను చాలా జాగ్రత్తగా సరి చూసుకోవాలి ఆడవారికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ కూడాను మగవారికుంటుంది కావున మీ ప్రవర్తన చాలా జాగ్రత్త...