సాధారణంగా పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్క ఆడవారు కూడాను కామన్ గా ఆలోచించే విషయం ఏమిటి అంటే, తమ భర్త తమకు ఎటువంటి కష్టం రాకుండా బాగా చూసుకుంటాడని, మమ్మల్ని ఎప్పుడు కూడాను ఆనందంగా ఉంచుతాడని మరియు మమ్మల్ని ఎంతో సుఖ పెడతాడని ప్రతి ఒక్క భార్య కూడాను, ఎన్నో ఆశలతోనూ మరియు కోరికలతోనూ తమ అత్తగారింటికి వస్తుంది, ఇలాంటి సందర్భాల్లో వారికి ఎదురేటువంటి కొన్ని సమస్యలు మరియు సవాలను ఇక్కడ మనం తెలుసుకుందాం.
భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు అనేవి అనేక విషయాలు మీద ఆధారపడి ఉంటాయి, అవి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధమైన విషయాలు కావచ్చు మరియు శారీరిక సంబంధమైన విషయాలు కూడాను కావచ్చు, కానీ వీటన్నిటిని భార్యాభర్తలు ఇరువురు కూడాను ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, వాటిని ఎలా అర్థం చేసుకుంటున్నారు వీటన్నిటిని కూడాను ఎలా సరి చేసుకుంటున్నారు, ఇక్కడ వీరికి వచ్చినటువంటి సమస్య ఏంటి వాటికి పరిష్కారం ఏమిటి మరియు ఈ కుటుంబ వ్యవస్థలో సాధారణంగా మగవారే కుటుంబ పెద్దగా ఉంటాడు ఇలాంటి సందర్భంలో మగవారు తమ భార్యలను ఎలా సుఖ పెడుతున్నారు మరియు వారు సంతోషంగా ఉన్నారా లేదా అని ఇక్కడ మనం తెలుసుకుందాం.
వీటిలో మొదటిగా ఆర్థికపరమైనటువంటి విషయాలు, సాధారణంగా చెప్పాలి అంటే కుటుంబాన్ని పోషించవలసినటువంటి బాధ్యత కుటుంబ పెద్దగా మరియు మగవారిగా వీరికి ఉంటుంది, ఇలాంటి సందర్భాల్లో పెళ్లయిన తర్వాత భర్తకు కానీ సరైన ఉద్యోగం మరియు సరేనా ఆదాయం వచ్చే మార్గం లేకపోతే, ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడాను తమ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ ఉంటే, ఇలాంటి సందర్భంలో ఆ కుటుంబానికి కోడలిగా వచ్చినటువంటి ఆ అమ్మాయి యొక్క ఆలోచన పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది, ఎందుకంటే కొత్తగా పెళ్లయినప్పుడు వారికంటూ కొన్ని కోరికలు ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడం కోసం వారు మిమ్మల్ని అడగవచ్చు ఇలాంటి సందర్భంలో మీరు ఆ కోరికలు నెరవేర్చడానికి కావలసిన డబ్బు కోసం మీ తల్లిదండ్రుల మీద గనుక మీరు ఆధారపడవలసి ఉంటే మీ భార్య అసలు మిమ్మల్ని లెక్కచేయరు, కావున ప్రతి ఒక్క మగవారు కూడాను పెళ్లికి ముందే తమ కుటుంబాన్ని తామే పోషించుకునే ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకోవాలి.
ఈ వరుసలో మనం వివరించేటువంటి మరొక విషయం ఏమిటి అంటే అదే శృంగార సంబంధం అయినటువంటి విషయం, ఈ శృంగార విషయంలో మగవారికి ఎలాంటి ఆలోచనలు అయితే ఉంటాయో అలాగే ఆడవారికి కూడాను ఉంటాయి, పెళ్లయిన ప్రతి ఆడవారు కూడా తమ భర్తతో సంసార సుఖాన్ని పొందాలని అనుకుంటూ ఉంటారు దీనికి తగినట్లుగానే మగవారి యొక్క ప్రవర్తన లేకపోతే వారు చాలావరకు నిరుత్సాహపడతారు, ప్రస్తుత ఆధునిక సమాజంలో ఈ ఒక్క కారణం మీదే చాలామంది జంటలు తమ కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారు, కావున ప్రతి ఒక్క మగవారు కూడానా మీకు ఉద్యోగరీత్యా లేక వ్యాపార రీత్యా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ భార్యతో గడపవలసిన సమయాన్ని వారికి కేటాయించండి లేకపోతే మీ కుటుంబమే విచ్ఛిన్నమయ్య ప్రమాదం ఉంది.
ఇదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే కుటుంబ సంబంధమైనటువంటి గొడవల వల్ల చాలామంది జంటలు విడిపోతున్నాయి, పెళ్లయిన తర్వాత ప్రతి ఆడవారు కూడాను తమ అత్తగారి ఇంటి గురించే ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు, వారి ఆలోచనలకు తగినట్లుగా వాస్తవ జీవితం లేకపోతే వారు మానసికంగాను చాలా కృంగిపోతారు, కుటుంబంలో కోడలికి మరియు అత్తమామలకి మధ్య ఏదైనా గొడవ జరిగితే దానిని చాలా సామరస్యంగా పరిష్కరించాలి, కొత్తగా వచ్చిన కోడలు కాబట్టి అత్తగారు కూడాను కోడలి మనసుని ఎరిగి నడుచుకోవాలి, అదేవిధంగా కోడలు కూడాను అత్తగారి మనసు ఎరిగి నడుచుకోవాలి, ఈ క్రమంలో మగవారు ఎప్పుడు కూడాను ఏకపక్ష నిర్ణయానికి పోకూడదు ఎందుకంటే మీరు గనక మీ తల్లికి సపోర్ట్ చేసి నీ భార్యను దూషిస్తే వారి మనసు నొచ్చుకుంటుంది, ఇదేవిధంగా తల్లి విషయంలో కూడాను చేయకూడదు, ఒక బ్యాలెన్సింగ్ మైండ్ తో వచ్చిన సమస్యను పరిష్కరించేటువంటి మనస్తత్వం మగవారికి ఉండాలి అప్పుడే ఆ కుటుంబం నిలబడుతుంది.
పైన మేము తెలిపిన విషయాలన్నీ కూడాను ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం ఇవి ఎవరైతే చిన్న చిన్న విషయాలకు వారి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకుంటున్నారో వారు ఈ విషయాలను గమనించి తమనే నమ్ముకుని వచ్చినటువంటి తమ భార్యను సుఖంగాను, సంతోషంగాను చూసుకోవాలని మా మనవి.