ఈ ఆధునిక కాలంలో చాలామంది సేంద్రియ ఉత్పత్తుల పైన మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలి పైన చాలామంది ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఆధునిక కాలంలో చాలామంది సేంద్రియ ఉత్పత్తుల పైన మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలి పైన చాలామంది ఆసక్తి చూపుతున్నారు, ఈ కరోనా వచ్చిన దగ్గరనుంచి చాలామంది తమ ఆహారాన్ని ప్రకృతి సిద్ధమైన మరియు కెమికల్స్ వాడని ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకోవాలని చాలామంది ఆసక్తి చూపుతున్నారు, వీరి కోసం ఈ గానుగ నూనె ప్రాసెస్ చాలా ఉపయోగపడుతుంది వాళ్లకి, ఎందుకంటే పూర్వకాలం నుంచి మన పెద్దవారు ఉపయోగిస్తుంది ఈ గానుగ నూనె, ఈమధ్య కాలంలోనే ఇలా ప్యాకింగ్ చేయబడినటువంటి వంటనూనె మార్కెట్లోకి వస్తుంది, ఇది ఎంతవరకు శ్రేయస్కరం అని చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే వంటనూనె ఎంతవరకు మంచిది , ఆరోగ్యమంతమైనది అయినదా కాదా అని మనకు తెలుస్తుంది.
ఉదాహరణకు వేరుశనగ నూనె వాడుకుంటున్నాము అనుకోండి వేరుశనగలు ప్రస్తుతం మార్కెట్లో 110 నుంచి 120 వరకు కేజీ ఉంది అలాంటిది ఒక కేజీ వేరుశనగ నూనె తీయటానికి రెండున్నర నుంచి మూడు కేజీల వరకు వేరుశనగలు మనకు అవసరం అవుతాయి అలాంటిది ఇప్పుడు ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఒక కేజీ వేరుశనగ నూనె మార్కెట్లో 180 నుంచి 190 మధ్యలో వారు ఎలా ఇస్తున్నారు, ఈ విధంగా చూస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి చాలా కంపెనీలు తమ నూనెను కల్తీ చేస్తున్నాయి, అందుకనే ప్రస్తుతం చాలామంది డబ్బులు గురించి ఆలోచించకుండా తమకు మంచి ఆరోగ్యవంతమైన ఆహారం కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, వీరికోసమే ఈ గానుగ నూనె ప్రాసెస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ గానుగ నూనె తయారుచేయడానికి ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం లేదు, మార్కెట్లో గానుగ నూనె తయారు చేసేటటువంటి పద్ధతులు మరియు వాడికి సంబంధించినటువంటి మిషనరీస్ చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఈ గానుగ నూనె తయారుచేసినటువంటి మిషనరీలో సంప్రదాయ బద్ధమైనటువంటి మిషనరీ కాకుండా ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్నటువంటి మిషన్ ఉపయోగించడం వల్ల ఉత్పత్తి చాలా పెరుగుతుంది, మరియు ఖర్చు కూడాను చాలా తక్కువ అవుతుంది, ప్రస్తుతం ఈ మిషన్స్ మనకు అందుబాటులో ఆన్లైన్లో కూడా ఉన్నాయి ముఖ్యంగా ఇండియా మార్ట్, అమెజాన్ వంటి ఆన్లైన్ వెబ్సైట్లో కూడాను ఈ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి, వీటి ధర కూడాను రెండు లక్షల 50 వేల నుంచి 10 లక్షల లోపు ఉన్నాయి, వీటి యొక్క రోజువారి ఉత్పత్తి సామర్థ్యం మీద వీటి ధర ఆధారపడి ఉంటుంది, సాధారణంగా రోజుకి వేయి కిలోలు ఉత్పత్తి సామర్థ్యం గల మిషన్ ధర రెండు నుంచి మూడు లక్షలు మధ్యలో ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే ఈ మిషనరీ ధర చాలా తక్కువ.
ఈ మిషన్స్ ఉపయోగించి మనం శనగ నూనె, కొబ్బరి నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, ఆముదము నూనె , ఆవనూనె ఇలా మార్కెట్లో దొరికేటువంటి ప్రతి ఒక్క సీడ్ మించి కూడాను మనం ఆయిల్ తీయవచ్చు, ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మిషన్ ఉపయోగించి ఏడు రకాల నూనెలను మనం ఉత్పత్తి చేయవచ్చు.
ఒక కేజీ వేరుశనగ నూనె తీయడానికి మనకు సుమారుగా రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు వేరుశనగలు కావలసి ఉంటుంది, ప్రస్తుతం మార్కెట్లో ఒక కేజీ వేరుశనగలు 110 నుంచి 120 వరకు ఉన్నాయి, ఇలాగే మనం ఒక కేజీ నూనె తయారు చేయడానికి మనకు సుమారుగా 250 రూపాయలు ఖర్చు అవుతుంది, దీన్ని మనం బయట మార్కెట్లో 300 రూపాయలకు కనక మనం విక్రయిస్తే మనకు ఒక కేజీకి 50 రూపాయల వరకు లాభం వస్తుంది, రోజుకి ఒక 20 లీటర్ కనుక మనం అమ్మగలిగితే రోజుకి వేయి రూపాయలు మరియు అదేవిధంగా ఆయిల్ తీయగా వచ్చినటువంటి తుక్కును మనం కేజీ 35 నుంచి 50 రూపాయల వరకు మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాపల మరియు రొయ్యల చెరువు వారు వీటితోపాటుగా కోళ్ల ఫారం వారు కూడాను కొంటారు, ఈ విధంగా రోజుకి మనకు 3000 నుంచి 5వేల వరకు లాభం వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది.
ఈ వ్యాపారంలో మనం చేయవలసిందల్లా మన యొక్క వ్యాపార పరిధిని విస్తరించుకోవడమే, దీనికోసం మనం మన చుట్టుపక్కల ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్, కిరాణా షాపులు వాళ్లని సంప్రదించి మన యొక్క ప్రోడక్ట్ గురించి వాళ్లకి వివరించి, మార్కెట్ చేసుకోవడమే మన యొక్క ప్రాథమిక కర్తవ్యం, వీటితో పాటుగా సోషల్ మీడియా అలాగే ఆన్లైన్ వెబ్సైట్లో కూడాను మన యొక్క వ్యాపారానికి సంబంధించి నటువంటి ప్రొడక్ట్స్ గురించి పోస్ట్ చేయడం ద్వారా మన వ్యాపార పరిధిని విస్తరించుకోవచ్చు.
ఈ యొక్క వ్యాపారంలో మార్కెటింగ్ గురించి మనం ఎప్పుడు కూడాను దిగులు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే బయటి మార్కెట్లో దొరికేటువంటి ఆయిల్ కన్నా కూడాను మనం విక్రయించేటువంటి ఆయిల్ ధర సుమారుగా లీటరుకు 50 రూపాయలు పైనే హెచ్చుగా ఉంటుంది, అయినా కూడాను ధర ఎక్కువగా ఉందని చెప్పి మనం భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మన యొక్క ప్రోడక్ట్ చాలా స్వచ్ఛమైనది, ప్రస్తుతం మార్కెట్లో చలామణి అవుతున్నటువంటి నూనెలు అన్నీ కూడాను చాలావరకు కలుషితమైనవే, కానీ మనం స్వచ్ఛమైనటువంటి వంట నూనెను కస్టమర్స్ కి అందిస్తున్నాం, దీనికోసం వారు ఒక కేజీకి 50 రూపాయలు ఎక్కువ ఇవ్వటానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ విముఖత చూపరు.
ప్రస్తుతం ఈ ఆధునిక సమాజంలో అందరూ కూడాను స్వచ్ఛమైన ఆహారం, స్వచ్ఛమైన గాలి మరియు ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం తమ యొక్క సమయాన్ని మరియు ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది.
దీనికోసం మనం చేయవలసినదల్లా ఒకే ఒక్కటి మన ప్రొడక్ట్ కి మంచి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేయడమే, దీనికోసం ఒక బ్రాండ్ నేమ్ మీద చక్కని ప్యాకింగ్ కవర్స్ లేదా డబ్బాలలో 1 లీడర్, 5 లెటర్స్ మరియు 10 లీటర్లుగా వాటిని ప్యాక్ చేసి మన దగ్గరలో ఉన్నటువంటి సూపర్ మార్కెట్, కిరాణా షాపుల్లో మనం హోల్సేల్గా అమ్మితే మంచి ప్రాఫిట్ రావడంతో పాటు మన ప్రోడక్ట్ వాల్యూ పెరుగుతుంది.