మనం ప్రతిరోజు కూడాను ఆహారంలో వెల్లుల్లి ఉపయోగిస్తూ ఉంటాం, బహుశా వెల్లుల్లి లేకుండా ఏ వంట కూడాను చెయ్యము, ఇలాంటి ఈ వెల్లుల్లిని మనం కొంచెం శ్రమించి ప్రాసెస్ చేయడం ద్వారా నెలకు వేళల్లో సంపాదించుకునే అవకాశం ఉంది అది ఎలాగో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.
సాధారణంగా వెల్లుల్లిని మనం బయట బజారులోనూ, కిరాణా షాపుల్లోనూ వెల్లుల్లి ని పెద్దవిగా కొని వాటిని రెబ్బలుగా విడగొట్టి వాటిపై ఉన్నటువంటి తోలు తీసి మన ఆహార వంటలలో ఉపయోగిస్తూ ఉంటాం, ఒక విధంగా చెప్పాలి అంటే వెల్లుల్లి రెబ్బలు యొక్క తోలు తీయడం కొంతమందికి చాలా విసుగుగా ఉంటుంది, చిన్న మొత్తంలో అయితే తీయవచ్చు గాని కొంచెం పెద్ద మొత్తంలో అయితే వాటి యొక్క రెబ్బలు తీయడం చాలామందికి తలనొప్పిగా ఉంటుంది, ఇలాంటి వారిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు అది ఎలాగంటే.
వెల్లుల్లి మనం మార్కెట్లో కొని వాటిని రెబ్బలుగా చేసి దానిపైన ఉన్నటువంటి తోలు తీసివేసి వాటిని చక్కగా డబ్బాలలో కానీ, ప్యాకింగ్ కవర్లో కానీ ప్యాక్ చేసి కేజీలు లెక్కన మార్కెట్లో విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయి, ఇప్పుడు మీరు కూడాను ఒక మాట అడగవచ్చు అదేమిటంటే ఆహార వంటల్లో వేసే ఒకటి రెండు వెల్లుల్లిపాయలను రెబ్బలుగా చేసి వాటిపై ఉన్నటువంటి తోలు తీయడానికే చాలా సమయం పడుతుంది అలాంటిది ఇదే బిజినెస్ అయితే ఇంకెంత సమయం పడుతుందో అని ప్రతి ఒక్కరికి కూడాను ఆలోచన రావచ్చు, అందుకనే మనం ఇక్కడ ఒక మిషన్ ని మార్కెట్లో కొనవలసి ఉంటుంది.
ఈ మిషన్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే మనకు లభిస్తుంది మనం ఈ మిషన్ను ఇండియా మార్ట్ మరియు అమెజాన్ లాంటి వెబ్సైట్ ద్వారా ఈ మిషన్ మనము కొనుక్కోవచ్చు , ఈ మిషన్ ధర కూడాను సుమారు 13 వేల నుంచి 15000 మధ్యలో ఉండవచ్చు, చాలా తక్కువ ధర కాబట్టి ఈ మిషన్ కొనుగోలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే బయటి మార్కెట్లో మనకి వెల్లుల్లి సుమారుగా 70 రూపాయల నుంచి 100 రూపాయలు మధ్యలోనే ఉంటుంది, ఈ మధ్యకాలంలో చాలా తక్కువ ధరకే మార్కెట్లో మనకు వెల్లుల్లి లభించింది, మనం కొనేటప్పుడు వెల్లుల్లి పెద్దవిగా కాకుండా రెబ్బలుగా హోల్సేల్ లో కొంటే మనకు చాలా తక్కువగానే వస్తుంది, ఇలా కొన్నటువంటి వెల్లుల్లి మనం ఈ మిషన్ ద్వారా వాటిపై ఉన్నటువంటి తోలు తీసివేసి, వీటిని చక్కగా 1/2 కేజీ నుంచి కేజీ వరకు గల డబ్బాలలో ఒక మంచి బ్రాండ్ లాగా ప్యాకింగ్ చేసి వీటిని కనుక మనం మార్కెట్లో విక్రయిస్తే మనకు మంచి లాభాలు వస్తాయి.
ఎలాగంటే ఉదాహరణకు కేజీ వెల్లుల్లి 50 రూపాయలు అనుకుందాం అలాంటిది తోలు తీసేసినటువంటి ఒక కేజీ వెల్లుల్లి రెబ్బలను తయారు చేయడానికి మనకు ఒక కేజీ నారా కావాలి అని అనుకున్నాం అలాంటప్పుడు ఒక కేజీ వెల్లుల్లి రెబ్బలు తీయడానికి మనకు అయ్యే ఖర్చు, వెల్లుల్లి ధర 75 రూపాయలు అలాగే డబ్బా కు అయ్యే ఖర్చు 15 రూపాయలు వేసుకుందాం అలాగే పవర్ కంజంక్షన్ కి ఒక ఐదు రూపాయలు వేసుకుందాం మొత్తం ఒక కేజీ వెల్లుల్లి రెబ్బలు తీయడానికి మనకు అయిన ఖర్చు వంద రూపాయలు, ఇలా ప్యాక్ చేసినటువంటి వెల్లుల్లి రెబ్బలని మనం మార్కెట్లో గనక 200 నుంచి 250 మధ్యలో అమ్మితే, మనకు ఒక కేజీకి 100 నుంచి 150 రూపాయలు లాభం వస్తుంది.
ఈ విధంగా మనము రోజుకి గనక ఒక పది కేజీలు వెల్లుల్లి రెబ్బలను అమ్మితే రోజుకి వెయ్యి రూపాయల నుంచి 1500, నెలకు 30 వేల నుంచి 45 వేల వరకు లాభం రావడం ఇక్కడ మనం చూస్తున్నాం, చాలామంది ఆలోచన ఎలా ఉంటుంది అంటే వీటిని ఎవరు కొంటారు ఎలా అమ్ముడు పోతాయి, ఇలా చేయటం మా వల్ల కాదు, ఒకవేళ చేసిన ఇలా తోలు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బలు అమ్ముడు పోకుండా ఉంటే మా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటారు.
వీటన్నిటికీ ఒకే ఒక మార్గం అదేమిటంటే ఎప్పుడైనా కానీ మనం బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మన చుట్టుపక్కన ఉన్నటువంటి మార్కెట్ ని మనం అనలైజ్ చేయాలి, వీటి యొక్క అవసరం చుట్టుపక్కల ఎలా ఉంది, అలాగే ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి వదిలితే కస్టమర్స్ కొంటారా లేదా అని మొదటిగా మనం మన యొక్క మార్కెట్ పరిధిని పరిశీలించాలి, ఈ ప్రోడక్ట్ కి మనకి మంచి మార్కెట్ ఏమిటి అంటే హోటల్స్, క్యాటరింగ్ బిజినెస్ చేసేవాళ్లు, ఫంక్షన్ హాల్స్ వీటి ద్వారా మనకు చాలా మొత్తంలో మార్కెట్ అవుతుంది ఎందుకంటే వీరికి వెల్లుల్లి అధిక మొత్తంలో కావలసి వస్తుంది ఇలాంటి సమయంలో వీరికి తోలు తీసినటువంటి వెల్లుల్లి రెబ్బల ద్వారా చాలా సమయం కలిసి వస్తుంది కావున ప్రతి ఒక్కరు కూడాను వీటిని కొనడానికి ఇష్టపడతారు, దీంతో పాటు సాధారణ గృహినీలు కూడాను వీటిని కొని వారి యొక్క ఫ్రీజర్ లోను నిల్వ ఉంచుకోవడం ద్వారా వారు నెల మొత్తం కూడాను వీటిని ఉపయోగించుకోవచ్చు వీరి ద్వారా కూడాను మనకు మంచి మార్కెట్ వస్తుంది, అలాగే ప్రస్తుత కాలంలో ఆన్లైన్ మార్కెటింగ్ చాలా విస్తరించి ఉంది వీటిలో కనుక మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇక్కడినుంచి మన ప్రొడక్ట్ కి మంచి మార్కెట్ వస్తుంది.
కాబట్టి మీరు గనక ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే మార్కెటింగ్ గురించి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు మంచి మార్కెట్ మన చుట్టుపక్కల ఎంతో ఉంది మనం చేయవలసిందిగా కష్టపడి పనిచేయటమే.