మరుగుదొడ్లో- మనసును పొట్టపైనే ఎందుకుండాలి?
మనసుంటేనే మార్గం అనే మాట మనమంతా ఈ నాడు పూర్తిగా మరచిపోయాం. శరీరంలోగాని జీవితంలో గాని, నీ పని సక్రమంగా జరగా లన్నా పనిమీదే వారి మనసు పూర్తిగా లగ్నమై వుండాలి. అలా లగ్నం. కానివాడు ఆ పని సక్రమంగా నెరవేరదు.
సుఖవిరేచనం కాకపోతే ఎన్ని దు:ఖాలు కలుగుతాయో తెలుసుకోండి
ఇలా మలాశయంలో మిగిలిపోయిన మలం మరలా జఠరాగ్నిచేత ఉదరంలోకి లాగబడి స్వచ్ఛమైన అన్నరసంతో కలిసి పచనం. చేయబడి ధాతువులలోకి చేరిపోతుంది. స్వచ్ఛమైన ఆహారరసం నుండి వరుసగా రక్తము, మాంసము, కొవ్వు, ఎముక, మజ్జ, వీర్యము లేక స్త్రీలలో ఆర్తవము అనే ధాతువులు తయారౌతూ వుంటయ్. అయితే విసర్జింపబడిన మలం ఎప్పుడైతే స్వచ్ఛమైన అన్నరసంలో కలిసి పచనం చేయబడిందో ఆ మురుగుడు మొత్తం రక్తంలోను, మాంసంలోను, కొప్వులోను, ఎముకలలోను, మజ్జలోను, వీర్యం లేక ఆర్తవములోను రోజురోజు చేరిపోతు క్రమక్రమంగా శరీరంలో సకలరోగాలు ఉత్పన్నం. కావడానికి కారణమౌతుంది. ఒక చిన్నతప్పు ఎంత పెద్ద ముప్పుకు దారితీస్తుందో ప్రజలు అర్ధం చేసుకొని మనసును మలాశయంపైన నిలిపి సుఖవిరేచనం కావడానికి ప్రయత్నంచేయాలి.
ఈనాటి ఆధునిక ప్రజల్లో ముఖ్యంగా పురుషుల్లో. అధికశాతం మంది మల విసర్జన సమయంలో చాలా తప్పులు చేస్తున్నారు. మరు గుదొడ్లోకి వెళ్ళేటప్పుడు దినపత్రికలు, సెల్ఫోన్లు, సిగరెట్లు, కొంతమందిచేతి తో కాఫీకప్పు కూడా పట్టు కొని, కార్తిక మాసంలో వన భోజనానికి వెళ్ళినట్లుగా వెళ్తున్నారు. ఈ దరిద్రమైన దౌర్భాగ్యకరమైన దురల వాటు ఇంగ్లీషు వారి నుండి మనవాళ్ళు నేర్చుకొన్నారు.
మరుగుదొడ్లోకి వెళ్ళి కాఫీతాగడం ముగించి సిగరెట్వెలిగించి పొగపీలుస్తూ దినపత్రిక చదువుతూ మధ్యమధ్యలో సెల్పోన్లలో మాట్లాడుతూ తమ మనసును మలాశయంపైన ఉంచకపోవడం
ఫోన్ లో చాటింగ్ చేయడం వీడియో గేమ్ లు అడడం వల్ల మలవిసర్జన వీరికి సక్రమంగా జరగదు. ఇలాంటివారంతా గంటలతరబడి మరుగుదొడ్లోనే కూర్చోవడానికి అలవాటు పడతారు.
అక్రమ మలవిసర్జనతో అనేక వ్యాధులు
పైన తెలిపిన విధంగా స్వయం కృత అపరాధాలతో సహజ "ను, మలవిసర్జన క్రియను పాడుచేసుకొని, దానివల్ల అతి భయంకరమైన నేను అర్శమొలలు, భగందరం, చర్మరోగాలు, వ్రణాలు, గడ్డలు, పుండ్లు, నోటిదుర్వాసన, తీవ్రమైన అజీర్ణం అతికొవ్వు, మధుమేహం ఇలా కు సర్వ వ్యాధులను తనకు తానే కొనితెచ్చుకొంటూ కష్టార్జితాన్ని ఆసుపత్రులకు ధారపోస్తు అకాల రోగాలతో మంచానపడి కుళ్ళి వాలి. కుశించి నశించిపోవడమే మానవ నాగరికతా? ఆలోచించండి.