నిండు చంద్రుడు లాగా మీ ముఖం మెరిసిపోవాలంటే ఏం చేయాలి

KV Health Tips
0

 ఒక అందమైన అమ్మాయిని చూసినా లేదా అందమైన అబ్బాయిని చూసినా మనము కూడా వాళ్ల లాగా ప్రత్యేకంగా  అందంగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అలాగే కొంతమంది అయితే తమ అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ఎంత డబ్బు అయినా కానీ ఖర్చు చేయడానికి వెనకాడరు, దానికోసం ఎన్నో మందులు మరియు  ప్లాస్టిక్ సర్జరీలు కూడాను చేసుకుంటారు,  మనం ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో మన ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

National glowing skin tips, బ్యూటీ టిప్స్, ఆరోగ్యం ఆనందం సంపద, సహజ సౌందర్య చిట్కాలు

ప్రస్తుత ఆధునిక సమాజంలో శారీరిక అందానికి చాలామంది ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పూర్వం సౌందర్యం అంటే ఆడవారే గుర్తొచ్చేవారు కానీ ఈ ఆధునిక యుగంలో ఆడవారితో పాటుగా బాహ్య సౌందర్యం కోసం మగవారు కూడాను వీరితో పాటుగా పోటీ పడుతున్నారు.దీనికోసం వారు మార్కెట్లో దొరికేటువంటి అనేక రకాలైనటువంటి ఫేషియల్ క్రీమ్స్ మరియు కాస్మెటిక్స్ వాడుతున్నారు దీని వల్ల వారికి అనేక రకాలు అయినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మరియు వీటిని ఎక్కువగా వాడేవారికి స్కిన్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా  మన ఇంటిలో ఉన్నటువంటి వస్తువుల ద్వారా మన అందాన్ని పెంచుకునే మార్గాలను ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం.


బంగాళదుంప ఉడికించి తొక్కుతీసి పాలతోగాని, పుల్లటి పెరుగుతో గానీ ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలు నశించగలవు.


 కోడిగ్రుడ్డు తెల్లసొన, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళలో దూది ముంచి నెమ్మదిగా కడుక్కొంటే మీ ముఖము నునుపుదేలి వుండగలదు.


కొన్ని రకాల మచ్చలు, గుంటలు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పోగొట్టుకోవచ్చుకాని ఖర్చుపెట్టటానికి ఆర్ధిక పరమయిన ఇబ్బందులు గలవారు(నిమ్మరసం, బార్లీ పిండి, మినపపిండి కలిపి రాసుకుంటే మచ్చలు, గుంటలు తగ్గగలవు.


చిట్కాలు రోజూ క్రమంతప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంటసేపుంచి తర్వాత స్నానం చేయాలి.


 పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి ముఖానికి రాసుకుని పది నిముషముల తర్వాత కడిగేసుకోవాలి.


 కొబ్బరినూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంటతర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి.


పులిపిర్లు రాలిపోయిన తర్వాత మచ్చపోవటానికి తేనె, నిమ్మరసం కలిపి రాయాలి.


 కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు పోగలవు.


 తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మముపై మచ్చలు, గుంటలు తగ్గగలవు.


కొబ్బరిపాలతో మర్దన చేసిన చర్మం కాంతివంతంగా ప్రకాశించగలదు.


 మీ మెడ కంఠంపై ముడతలు ఉంటే మీగడలో నిమ్మరసం పసుపు తేనె కలిపి మసాజ్ చేయండి.


 మీ మెడకు నల్లగా ఉంటే దోసకాయ గుజ్జు రాస్తే నలుపు పోతుంది.


పైన వివరించిన విషయాలు అన్నీ కూడాను మీరు సూచ తప్పకుండా పాటిస్తే అందమైన ముఖ కాంతిని మీరు పొందవచ్చు, దీనికి ఎటువంటి డబ్బు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కేవలం మీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను  మేము చెప్పిన రీతిలో క్రమం తప్పకుండా ఉపయోగిస్తే చాలు  మీరు మంచి ఫలితాలను పొందుతారు

 

Post a Comment

0Comments
Post a Comment (0)