శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించాలి: ఎస్పీకి వైసీపీ నేతల వినతి


 పుట్టపర్తి, జూలై 7(మీకోసం న్యూస్ ): శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా రాజకీయ నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఇటీవల కదిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని, ఇటువంటి వ్యాఖ్యలను అరికట్టి జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉషశ్రీ చరణ్, కదిరి సమన్వయకర్త బీఎస్ మక్బూల్, తోపుదుర్తి నయనతార రెడ్డి, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప, హిందూపురం సమన్వయకర్త టి.ఎన్. దీపిక వేణు రెడ్డితో పాటు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు