గోరంట్ల, జూలై 7:(మీకోసం న్యూస్ )
గోరంట్ల మేజర్ గ్రామపంచాయతీ నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన గురుస్వామిని సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు మంగళవారం ఘనంగా సన్మానించారు. పూలమాలలు, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న ప్రధాన సమస్యలను కార్యదర్శి గురుస్వామి దృష్టికి తీసుకెళ్లిన సభ్యులు, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని కార్యదర్శి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు నాగే నాయక్, గిరిధర్ గౌడ్, షేక్ అజ్మతుల్లా, బీరే వేణుగోపాల్ రాయల్, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్‌లు