బ్యాంకు స్టేట్‌మెంట్ కోసం మూడు రోజుల తిప్పలు..!

మీకోసం న్యూస్ I సోమందేపల్లి 


 సోమందేపల్లి కెనరా బ్యాంకుపై ఖాతాదారుల ఆగ్రహం

సోమందేపల్లిజులై 08 : అకౌంట్ స్టేట్‌మెంట్ కోసం వచ్చిన ఖాతాదారులను మూడు రోజుల పాటు బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారంటూ సోమందేపల్లి కెనరా బ్యాంకుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖాతాదారుల వివరాల ప్రకారం, తమ ఖాతాకు సంబంధించిన 14 పేజీల పూర్తి స్టేట్‌మెంట్ కోరగా మొదట కొంత భాగం మాత్రమే ప్రింట్ చేసి ఇచ్చారని తెలిపారు. మిగిలిన పేజీలు ఇవ్వాలని కోరితే ప్రతిరోజూ బ్యాంకుకు రమ్మని చెప్పి చివరకు "మా దగ్గర ప్రింట్ రావడం లేదు... బయట నెట్ సెంటర్‌లో ప్రింట్ తీసుకోండి. వారికి మెయిల్ చేశాం" అని బ్యాంకు మేనేజర్ చెప్పినట్లు ఆరోపించారు.

బ్యాంకులో అందించాల్సిన సేవ కోసం ప్రైవేట్ నెట్ సెంటర్‌ను ఆశ్రయించాలని చెప్పడం వల్ల సమయం, అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందని ఖాతాదారులు వాపోతున్నారు.

సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి, ఖాతాదారులకు పూర్తి స్థాయిలో సేవలు అందేలా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. బ్యాంకు యాజమాన్యం ఈ ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలని కూడా ఖాతాదారులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు