పెనుకొండకు ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ హోదా ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల.. టీడీపీ శ్రేణుల సంబరాలు


 మీకోసం న్యూస్ I పెనుకొండ 
పెనుకొండ, జూలై 8 (మీకోసం న్యూస్): పెనుకొండ నగర పంచాయతీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీ (సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ) హోదా కల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ జి.ఓ.ఎంఎస్. నెం.143, తేదీ 08-07-2026ను బుధవారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నాయకులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టపాసులు కాల్చి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రతులను ఆవిష్కరించారు. తర్వాత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్‌ను కలిసి పట్టణ అభివృద్ధి ప్రణాళికపై చర్చించారు.

టీడీపీ అర్బన్ కన్వీనర్ శ్రీరాములు మాట్లాడుతూ, మున్సిపాలిటీ హోదాతో పెనుకొండకు మరిన్ని ప్రభుత్వ నిధులు లభించి రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. మంత్రి సవితమ్మ కృషితో అమృత్ (AMRUT) పథకం కింద సుమారు రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్, టీడీపీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు