విద్యార్థులకు చిక్కీలను వెంటనే సరఫరా చేయాలి పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర

మీకోసం న్యూస్ : కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార కార్యక్రమంలో భాగంగా అందించాల్సిన చిక్కీలు విద్యా సంవత్సరం ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ సరఫరా కాకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని కొత్తచెరువులోని డీఈవో కార్యాలయంలో ఏడి వినయ్ మోహన్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 508 ప్రభుత్వ పాఠశాలలకు చిక్కీల సరఫరాలో నిర్లక్ష్యం వహించిన చండీఘర్ సీడ్స్ లిమిటెడ్ సంస్థపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని టెండర్‌ను రద్దు చేసి ప్రత్యామ్నాయ సంస్థ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు వెంటనే చిక్కీలను సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో విద్యార్థుల ఆరోగ్యం, హక్కుల పరిరక్షణ కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి ఎస్ యు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మొండి నందకిషోర్, నాయకులు భరత్, జనార్ధన్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు