లేపాక్షి, జూలై 8 (మీకోసం న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలంలోని కొడిపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులను శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు. వైఎస్సార్ రైతు సంక్షేమం కోసం చేసిన సేవలను నాయకులు స్మరించుకుని, ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు జి. నారాయణస్వామి, జడ్పీటీసీ సభ్యుడు బాణాల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు జేకే ప్రభాకర్, అశ్వత్థప్ప, ఆదినారాయణ, నాగరాజు, లీలావతి, చంద్ర పాల్గొన్నారు. అలాగే సర్పంచులు మంజునాథ్, నందిని వేణుగోపాల్ రెడ్డి, ఆదినారాయణ, వసుంధర ప్రభాకర్, నాగేంద్ర హాజరయ్యారు.
అదేవిధంగా మాజీ ఎంపీటీసీ శంకరప్ప, జయరామిరెడ్డి, బాలు, గోపాల్ రెడ్డి, వైఎన్ తిప్పన్న, గంగప్ప, గోపాలప్ప, శంకర్ రెడ్డి, శ్రీరామప్ప, అశోక్, మూర్తి, మంజునాథ్, జాబిర్, కో-ఆప్షన్ సభ్యుడు ఇర్ఫాన్, హనుమంతరాయప్ప, అనిల్, వెంకటేశులు, మోహన్, గంగాధర్, రాము తదితరులతో పాటు లేపాక్షి మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

0 కామెంట్లు