వైఎస్సార్ జయంతి ఘనంగా నిర్వహణ

మీకోసం న్యూస్ | పెనుకొండ 
 

పెనుకొండ, జూలై 8: మాజీ ముఖ్యమంత్రి జయంతి సందర్భంగా పెనుకొండలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో బుధవారం వేడుకలు నిర్వహించారు. తన నివాసంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శంకర్ నారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల సంక్షేమానికి వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు గృహాల నిర్మాణం వంటి సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మందికి మేలు చేశారని పేర్కొన్నారు.

వైఎస్సార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు అని ఆయన అన్నారు. ప్రజల తరఫున పోరాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకత్వం జగన్ మోహన్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే తాము ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐదు మండలాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు