విజయవాడలో జరిగే ‘వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్’ కార్యక్రమానికి ఆహ్వానం
మీకోసం న్యూస్,హిందూపురం, ఆగస్టు 21: మీకోసం న్యూస్: హిందూపురం పట్టణంలోని యువ ప్రతిభావంతులైన జాతీయ క్రీడాకారులను భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు ప్రత్యేకంగా కలిశారు. 14 సంవత్సరాల జాతీయ యువ క్రీడాకారుడు, 48 మెడల్స్ సాధించిన హితేష్ దత్తతో పాటు కరాటే, రెజ్లింగ్‌లో జాతీయ స్థాయి క్రీడాకారుడు చరణ్ రాజును వారి నివాసాలకు వెళ్లి కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈ నెల 22, 23 తేదీల్లో విజయవాడలో బీజేవైఎం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్ డైలాగ్’ కార్యక్రమానికి వారిని ఆహ్వానించారు.
జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ అనేక పతకాలు సాధించిన హితేష్ దత్తను, కరాటే మరియు రెజ్లింగ్‌లో జాతీయ స్థాయిలో రాణిస్తున్న చరణ్ రాజును నాయకులు అభినందించారు. యువతలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, వారిని వివిధ వేదికలపైకి తీసుకురావడం అవసరమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొని యువతకు సంబంధించిన అంశాలపై చర్చించడంతో పాటు, దేశ అభివృద్ధిలో యువత పాత్ర, నాయకత్వ లక్షణాలు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు బిల్లు కుళ్లాయప్ప యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాచర్ల హరీష్ పాల్గొని హితేష్ దత్త, చరణ్ రాజులను కార్యక్రమానికి ఆహ్వానించారు.
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010
0 కామెంట్‌లు