తేదీ | సమయం

మాదిగలంతా ఐక్యంగా తరలిరావాలని పిలుపు


మీకోసం న్యూస్, పుట్టపర్తి ఆగష్టు 18:

సభకు ముఖ్య అతిథిగా దండోరా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ

శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జిగా ఓబుల్ కుమార్, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాతంగి ఓబులేసు (భయ్యా) నియామకం

పుట్టపర్తి: మాదిగలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలంటే ఐక్యంగా ఏకతాటిపై నడవాలని దండోరా ఎంఆర్పిఎస్ అనంతపురం జిల్లా అధ్యక్షులు సాకే గురుమూర్తి పిలుపునిచ్చారు.

మంగళవారం పుట్టపర్తి పట్టణంలోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్‌లో స్థానిక నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల పర్యటనలో భాగంగా దండోరా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఈ నెల 26న పుట్టపర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సభకు ఊసురుపాటి బ్రహ్మయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా నుంచి వేలాది మంది మాదిగ కుల బాంధవులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

సభ ఏర్పాట్లు, సమన్వయం కోసం శ్రీ సత్యసాయి జిల్లా ఇన్‌చార్జిగా ఓబుల్ కుమార్‌ను, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాతంగి ఓబులేసు (భయ్యా)ను నియమించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో అనంతపురం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆలూరు గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి ముప్పులకుంట నల్లప్ప, కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు కృష్ణాపురం బాబు, తాలూకా ఇన్‌చార్జి ముప్పులకుంట డేవిడ్, శెట్టూరు మండల అధ్యక్షులు వెట్టి తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మండల నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

🪪 MEEKOSAM NEWS — PRESS ID CARD

Meekosam News Press ID Card Front
Meekosam News Press ID Card Terms and Conditions
గమనిక: ఈ కార్డు సంస్థ అంతర్గత గుర్తింపు/అధికారిక ప్రతినిధి గుర్తింపు కోసం మాత్రమే. ఇది ప్రభుత్వ ID కార్డు కాదు.

🗞️ MEEKOSAM NEWS — E-PAPER

🗞️
తాజా ఈ-పేపర్ ఇక్కడ

PDF/JPG/PNG ఎంచుకుని క్రింద ప్రివ్యూ చూడండి.

📤 E-Paper Preview / Upload
శాశ్వతంగా సైట్‌లో పెట్టడానికి: Blogger → Pages → E-Paper లో PDF/చిత్రాన్ని Upload చేసి Publish చేయాలి. ఈ theme‌లోని E-Paper ప్రాంతానికి ఆ published page/Drive preview URL‌ను తర్వాత పెట్టవచ్చు.