HOME ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినిమా బిజినెస్ క్రీడలు జాతీయం అంతర్జాతీయం ఫోటోలు భక్తి వీడియోలు ఆరోగ్యం స్పెషల్ స్టోరీస్

సోమందేపల్లికి విచ్చేసిన ఏపీ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సి. సావిత్రి

మీకోసం న్యూస్,సోమందేపల్లి, ఆగస్టు 16: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని సోమందేపల్లి మండల కేంద్రం కొత్తపల్లి క్రాస్‌లోని చాకల రామాంజినేయులు స్వగృహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ సి. సావిత్రి విచ్చేశారు. ఇటీవల పందిపర్తి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త, చాకల రామాంజినేయులు తండ్రి కీ.శే. ముత్యాలప్ప మృతి చెందగా, అనివార్య కారణాల వల్ల అప్పట్లో వారి కుటుంబాన్ని పరామర్శించలేకపోయిన సావిత్రి ఆదివారం వారి ఇంటికి వచ్చారు.

ఈ సందర్భంగా ముత్యాలప్ప చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముత్యాలప్పతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన సేవలను స్మరించుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో సోమందేపల్లి మండల రజక సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు జులుకుంట సంజీవరాయుడు, కార్యదర్శి రంగేపల్లి కిష్టప్ప, అయ్యవారి శ్రీనివాసులు, గోరంట్ల రామచంద్ర, వెంకటనారాయణ, పెనుకొండ కౌన్సిలర్ శ్రీరాములు, పెనుకొండ మండల రజక సంఘం అధ్యక్షులు శరత్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

అలాగే రజక సంఘం నాయకులు, రజక బంధువులు, కుటుంబ సభ్యులు పాల్గొని ముత్యాలప్పకు నివాళులర్పించారు. సావిత్రి స్వగృహానికి వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.

– మీకోసం న్యూస్, సోమందేపల్లి
✍️ ఎడిటర్: ప్రకాష్ | మీకోసం న్యూస్
Somandepalli | Sri Sathya Sai District | సంప్రదింపు: 9000250010

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు