తన అందం తోను హావభావాలతోను తెలుగు సినీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న అమ్మాయి శ్రీ లీల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే తను ఈ మధ్య బ్లాక్ డ్రెస్ తో ఫోటో షూట్ చేసినటువంటి కొన్ని ఫొటోస్ ని సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫొటోస్ చూసి చాలామంది కుర్రోళ్ళు మనసు పారేసుకున్నారు వాటిలో కొన్ని మీకోసం.
Photo credit:sreeleela/Instagram
శ్రీ లీల తెలుగులో చాలామందికి పరిచయం అక్కరలేని పేరు, తెలుగులో రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అయినటువంటి ఈ అమ్మాయి మొదటి చిత్రం ద్వారానే అనేకమంది కుర్రాళ్ళ మనసు దోచుకుంది. శ్రీ లీల యొక్క సినీ కెరియర్ మొదటిగా కన్నడ చిత్రమైన కిస్ అనే చిత్రం ద్వారా పరిచయం అయింది తర్వాత తెలుగులో రాఘవేంద్ర దర్శకత్వం వహించిన పెళ్లి సందడి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది, శ్రీ లీల భరతనాట్యంలో మంచి ప్రవీణ్యురాలు, శ్రీ లీల నటన మరియు ఆమె యొక్క అందానికి చాలామంది ముద్దులయ్యారు, పెళ్లి సందడి చిత్రం తర్వాత తెలుగులో కూడాను ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి, రవితేజ నటించిన ధమాకా చిత్రంలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది మరియు ఆ చిత్రం విజయవంతం కావడం ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది.
Photo credit:sreeleela/Instagram
త్రివిక్రం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి చిత్రంలో శ్రీ లీలకు హీరోయిన్ గా ఆమె కెరియర్ లో మర్చిపోలేనటువంటి అవకాశం వచ్చిందని చెప్పవచ్చు ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో నటించే అవకాశం రావడం చాలా అరుదు, ఇదే కాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రంలో పూజ హెగ్డే తో పాటు పవన్ కళ్యాణ్ పక్కన సిల్వర్ స్క్రీన్ పంచుకునే అవకాశం వచ్చింది, అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న బాలకృష్ణ సినిమా అయినటువంటి భగవత్ కేసరి చిత్రంలో కూడాను ఆమెకు అవకాశం వచ్చింది అలాగే నిఖిల్ తో ఎక్స్ట్రార్డినరీ మెన్ అనే చిత్రంలో కూడాను నటిస్తుంది, ఇవే కాక రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నటువంటి స్కంద చిత్రంలో తనకు హీరోయిన్గా మంచి అవకాశం వచ్చింది ఈ విధంగా తెలుగులో అనధి కాలంలోనే మంచి అవకాశాలతో శ్రీ లీల ముందుకు దూసుకుపోతుంది.
Photo credit:sreeleela/Instagram
ఇలాగే తన అందం మరియు నటన నైపుణ్యం ద్వారా తెలుగులో మంచి అవకాశాలతో నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.