స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దోషి ఎవరు ?

KV Health Tips
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోటా విన్న ఒకే ఒక్క మాట అదే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరుగులేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబునాయుడుని ఈ స్కామ్ లో దోషగా CID వారు అరెస్టు చేయడం జరిగింది.


స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దోషి ఎవరు,చంద్రబాబు,ఏపీ స్కిల్ స్కామ్,జగన్,వార్తలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరి నోటా విన్న ఒకే ఒక్క మాట అదే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తిరుగులేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబునాయుడుని ఈ స్కామ్ లో దోషగా CID వారు అరెస్టు చేయడం జరిగింది.


  ఏపీ స్కిల్ డెవలప్మెంట్  అంటే ఏమిటి?

రాష్ట్రంలో ఎంతోమంది యువకులు ఉన్నత చదువులు చదువుకొని ఉపాధి లేక ఖాళీగా ఉన్న వారికి, వారి విద్యార్హతకు తగినట్టుగా వారికి శిక్షణ ఇచ్చి మరియు వారికి ఉద్యోగ మార్గాలను చూపించడం ఈ ఏ.పీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క ప్రాజెక్టు కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిమెన్స్ ఇండస్ట్రీస్ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ మరియు డిజైన్ టెక్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారితో  మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ (MOU)  చేసుకోవడం జరిగింది.


నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి రాష్ట్ర వాటాగా ఇవ్వవలసిన 330  కోట్లను చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా తన బినామీ కంపెనీలకు దారి మళ్లించాలని ప్రధానంగా వీరి మీద ఆరోపణలు, ఈ స్కామ్ కు సంబంధించి ఆరోపణలు 2021  నుంచే వస్తున్నాయి, CID వారు  ఈ స్కామ్ గురించి పూర్తిగా దర్యాప్తు చేసి ED  కి ఈ స్కామ్ గురించిన సమాచారం కూడా ఇచ్చారు వారు కూడాను దీని మీద దర్యాప్తు చేసి స్కామ్ జరిగింది వాస్తవమేనని ధ్రువీకరించి తగిన సాక్షాలను  CIDకి ఇచ్చారు, వారు వారి దగ్గర ఉన్నటువంటి అన్ని సాక్షాలతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి CID కోర్టులో హాజరు పరచడం జరిగింది, కోర్టు  విచారణ కోసం చంద్రబాబు నాయుడు గారిని 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మరియు చంద్రబాబు గారిని రాజమండ్రిలోని సెంట్రల్ జైలు కి రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగింది, ఆయన తరపున ఎంతో అనుభవం ఉన్న సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా తన  వాదనలను వినిపించారు.


ఈ స్కామ్ లో A1  గా ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని మరియు A2  గా  అచ్చం నాయుడిని ఈ ఎఫ్. ఐ. ఆర్ లో పేరు నమోదు చేయడం జరిగింది. మరియు చంద్రబాబు నాయుడు మీద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది అవి ఏమిటి అంటే IPC  సెక్షన్ 120(8), 166,167,418, 420, 465, 468, 471, 409, 109, 201 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988  కింద  కేసు నమోదు చేయడం జరిగింది.


కానీ TDP వారి ప్రధాన ఆరోపణ ఏమిటి అంటే అధికారం పక్షంలో ఉన్నటువంటి YSRCP  వారు తమ మీద ఉద్దేశ పూర్వకంగా మరియు రాజకీయ కక్ష సాధింపు కోసం మా మీద  కేసులు  పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు మరియు వారు తెలుగుదేశం పార్టీ యొక్క అధికారిక వెబ్సైట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ పొందుపరిచామని దానిలో 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మరియు  రాష్ట్ర ప్రభుత్వం వాటా అంత కూడాను ఎక్కడ ఎప్పుడు మరియు దేనికి కి ఖర్చు చేసాము అంతా కూడాను విపులంగా ఉందని వారు పేర్కొంటున్నారు.  వీరికి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ కూడాను మద్దతు తెలిపారు, వారు కూడాను అన్యాయంగా చంద్రబాబుని ఈ కేసులో ఇరికించారు అని ఆరోపిస్తున్నారు.


దీనికి సమాధానంగా అధికార పార్టీ అయినటువంటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు దీటుగానే సమాధానం చెబుతున్నారు, వీరి వాదన ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది అని, దీనికి అన్ని సాక్షాలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా గానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేక మలుపులు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది, దీనికి నిరసనగా తెలుగుదేశం పార్టీవారు  రాష్ట్రంలో అనేక చోట్ల  తమ నిరసనను తెలియజేస్తున్నారు,


Post a Comment

0Comments
Post a Comment (0)