ఇలాంటి విషయాలు మీ భార్యకు గనుక చెప్పారో మీ పని అంతే

KV Health Tips
0

 భార్యాభర్తల మధ్య ఏమైనా సమస్య వస్తే ఇరువురు కూర్చొని చర్చించుకోవాలి, అలాగే వారి మధ్య గొడవ ఎట్టి పరిస్థితుల్లో  ఆ గది దాటి బయటికి వెళ్ళకూడదు మరియు  ప్రతి భర్త కూడాను కొన్ని విషయాలు భార్యకు చెప్పకూడదు, ఇలాంటి విషయాలు మీ భార్యకు గనుక చెప్పారో మీ పని అంతే.

సంసార జీవితం,భార్య భర్తల సంబంధం, భర్త రహస్యాలు,భర్త భార్యకు చెప్పకూడనటువంటి రహస్యాలు,ఇలాంటి విషయాలు మీ భార్యకు గనుక  చెప్పారో మీ పని అంతే

భర్త భార్య మనసును అర్థం చేసుకొని నడుచుకోవాలి తన ఆలోచన సరళి ఎలా ఉంది?, మీ భార్య మీ ఆలోచనలకు తగినట్లుగా నడుచుకుంటుందా లేక తన వ్యక్తిగత ఆలోచనల్ని మీ మీద రుద్దుతుందా అని తెలుసుకోవాలి, అదేవిధంగా  ప్రతి భార్య కూడాను  తన భర్త యొక్క మనసు ఎరిగి ఆయన అడుగుజాడల్లో నడవాలి అప్పుడే  ఈ సంసారం అనే సాగరాన్ని సాఫీగా ఈదగలుగుతాము, కానీ కొన్ని సందర్భాలలో భర్త ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని విషయాలు మాత్రం తన భార్యకు చెప్పకూడదు,  ఇలాంటి విషయాలు మీ భార్యకు గనుక  చెప్పారో మీ పని అంతే, అవి ఏమిటో ఇక్కడ మనం తెలుసుకుందాం.

మొదటిగా మీ సంపాదన గురించి మీ భార్యకు ఎట్టి పరిస్థితులను చెప్పకూడదు, ఎందుకంటే ప్రతి మగవాడు కూడాను కొన్ని విషయాలలో కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇలాంటి సమయంలో మీ భార్యకు కనుక మీ సంపాదన వివరాల మొత్తం చెప్పారు  అంటే ఆమె అడ్డుపడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ప్రతి భార్య కూడాను తన కుటుంబంలో మనీ మేనేజ్మెంట్ చేస్తుంది ఇలాంటి సమయంలో మీరు మీ ఖర్చుల గురించి   చెప్పారు  అంటే  తను అడ్డుపడే  అవకాశం కూడా ఉంది, కానీ అందరూ కూడాను ఇలానే ఉంటారు అని  చెప్పలేము, కొందరు తమ భర్త యొక్క మనసు ఎరిగి, వారి అవసరాలను తెలుసుకొని నడుచుకుంటారు.

రెండవదిగా మీకు మీ వివాహానికంటే ముందు ఏమైనా ప్రేమ వ్యవహారం ఉంటే అలాంటి విషయాలు మాత్రం మీ భార్యకు చెప్పకండి,  ఒకవేళ మీరు ఇలాంటి విషయాలు కానీ మీ భార్యకు చెబితే అర్థం చేసుకొని మీతో సన్నిహితంగా మెలిగితే పర్వాలేదు కానీ ఇలా కాకుండా మిమ్మల్ని అపార్థం చేసుకొని మానసికంగా వేధించే ప్రమాదం ఉంది, ఈ సమయాల్లో మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్న, లేక  ఇంటికి రావడానికి లేట్ అయిన, ఇలాంటి సందర్భాలలో మీ భార్య మీ ప్రేమ వ్యవహారాన్ని గుర్తుకు తెచ్చి, మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి ఉంది కావున ఎట్టి పరిస్థితుల్లోనూ విషయాలు మాత్రం చెప్పకండి .

మూడవదిగా, మీ పని లేక మీ ఆఫీసు వ్యవహారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ భార్యతో పంచుకోకండి, కొన్ని సందర్భాలలో మగవారు ఆఫీసులో వాళ్ళ బాస్ దగ్గర వర్క్ కి సంబంధించి మాట పడటం లేదా అవమానపడటం జరగవచ్చు, ఇలాంటి సందర్భాలు కనుక మీ భార్యకు చెప్పారు అంటే ఆమె అర్థం చేసుకోకపోగా మిమ్మల్ని బాధపెట్టే ప్రమాదం ఉంది, అందరూ కూడాను ఇలానే చేస్తారు అని మేము చెప్పడం లేదు ,ఎందుకంటే కొంతమంది భార్యలు భర్తకు జరిగినటువంటి ఆ సందర్భాన్ని అర్థం చేసుకొని అతనికి ధైర్యం చెప్పే ఆడవారు కూడా ఉన్నారు, ఏది ఏమైనా కానీ ఇలాంటి విషయాలు చెప్పే ముందు మీ భార్య మనసు ఎరిగి అప్పుడు చెప్పండి, లేదా అసలు చెప్పకపోవడం ఎంతో   ఉత్తమం.

మీ యొక్క బలహీనతలు ఏమైనా ఉంటే ఆ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీ భార్యకు చెప్పకండి ఇలా చెప్పడం ద్వారా మీ భార్య చేతిలో మీరు చులకన అయ్యే ప్రమాదం ఉంది, అసలు ప్రతి ఒక్క మనిషికి కూడాను కొన్ని అంతరంగిక రహస్యాలు ఉంటాయి, ఇలాంటి రహస్యాలు మీ మనసులో ఉంటేనే మీ జీవితం మరియు మిమ్మల్ని నమ్ముకున్న వారి జీవితం సంతోషంగా ఉంటుంది, ఇలా కాకుండా మీ రహస్యాలు కనుక మీ స్నేహితులతో కానీ లేక మీ భార్యతో కానీ వాటిని గనుక పంచుకుంటే మీ జీవితం అస్తవ్యస్తం అయ్యే ప్రమాదం ఉంది, కావున ఎప్పుడు కూడాను మన అంతరింగిక విషయాలు లేక రహస్యాలు ఎవరితో కూడాను పంచుకోకూడదు.

పైన తెలిపినటువంటి ప్రతి విషయాన్ని ప్రతి ఒక్క భర్త కూడాను తన మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మేము చెప్పినట్టుగా అందరూ ఆడవాళ్లు కూడాను ఇలానే ఉంటారు అని మేము చెప్పటం లేదు, కొందరు మాత్రమే తమ భర్త యొక్క బలహీనతలు మరియు  కష్ట పరిస్థితులు అలుసుగా తీసుకొని వారి భర్తను బాధపెట్టే పరిస్థితి ఉంది,ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని మేము ఈ విషయాలను ఇక్కడ వివరించడం జరిగింది, అంతేకానీ అందర్నీ మేము తప్పు పడటం లేదు,దయచేసి గమనించగలరు.



Post a Comment

0Comments
Post a Comment (0)