ఎప్పుడో ఒకసారి మనిషికి గుండెదడ రావటం సాధారణం. ఎక్కువ సందర్భాలలో అది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతుంది. గుండె దడ సమయంలో ఆ మనిషికి ఊపిరి అందకపోవటం, చెమటలు పట్టటం, టెన్షన్ని ఫిలవటం లాంటివి కూడా ఉండే అవకాశం లేకపోలేదు. ఛాతిలో నొప్పి కూడా ఉండవచ్చు.
కొన్ని సమయాలలో తల తిరుగుతున్నట్లుగా అనిపించటం, (మైకము) క్షణంపాటు స్పృహ కోల్పోవటం లాంటివి కూడా జరగవచ్చు.
సాధారణంగా గుండెదడకు కారణం చాలా మామూలుది అయి ఉంటుంది. జలుబు ఇన్ఫెక్షన్, లేక కెఫీన్ నికోటిన్ లేక ఆల్కహాలును అధికంగా సేవించటం లాంటివి ఏవైనా కారణం కావచ్చు.
ఏ ఎగుడు దిగుడులూ లేకుండా గుండె చాలా సాధారణంగా, సజావుగా పని చేస్తే బాగుండునని కోరుకోవటం ప్రతివాళ్ళకూ సహజం. అయితే ధడదడ మంటూ అకస్మాత్తుగా ఒకనొక క్షణాన గుండె దడ వచ్చినప్పుడు తన గుండె కేదో అవుతోందనుకుంటూ అతను గాభరా పడటం కూడా అంతే సహజం.
గుండె దడ చాలా అసౌకర్యంగానూ డిస్టబింగ్ గానూ ఉండటం వల్ల ఆ సమయాన ఏ మనిషి అయినా ఆందోళన చెందటం, వొత్తిడికి గురవటం సహజం.
గుండె దడ ఎందుకు వస్తుందంటే
మన శరీరంలో తయారయే అడ్రినలిన్ (Adrenaline) అనబడే హార్మోను మనం ఏదన్నా వొత్తిడిని చెందుతున్నప్పుడు మన శరీరాన్ని 'పోరాటానికి' లేక 'పారిపోవడానికి ప్రేరేపిస్తుంది.
ఉదాహరణకు మీరు పొలంలో ఉండగా ఒక పాము మీకు కనపడింది అనుకోండి, మీరు వేగంగా పారిపోవటానికి వీలుగా మీ శరీరంలో అడ్రినలిన్ అధికంగా ఉత్పత్తి అయి మీ కండరాలలోకి ప్రవహిస్తుంది. దానితో పాటు మీ బిపి రేస్ అయి, గుండె వేగంగా కొట్టుకుని, మీరు వేగంగా పరుగెత్తటానికి వీలు కలుగుతుంది. అయితే గుండె జబ్బు ఉన్న కొందరిలో అడ్రినలిన్ ఆధికోత్పత్తి గుండెదడను మరింత పెంచుతుంది.
కండరం యొక్క ఎలక్ట్రికల్ వైరింగ్, సిస్టమ్ అడ్రినలిని కి మరీ సెన్సిటివ్ పెంచి సాధారణంగా ఉండాల్సిన గుండెదడను నిముషానికి 72 Beats నుంచి 150 దాకా చుతుంది. మనం అనుభూతి చెందే గుండెదడ అదే.
ఆల్కహాల్, ఉబ్బసానికి వాడే మందులు, మానసికి వొత్తిడి, ఆందోళన లాంటివి. ఉత్పత్తిని అధికం చేయటం వల్ల కూడా పైన చెప్పిన విధంగా గుండెదడ వస్తుంది. ఒకోసారి థైరాయిడ్ వ్యాధిలో మొట్టమొదట కనిపించే లక్షణం గుండెదడ, గుండెదడ మీకు ఈ మధ్యనే ప్రారంభమై తీవ్రంగానూ, మాటిమాటికీ వస్తుంటే వెంటనే డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళటం మంచిది మందులతో సరి అవుతుంది.
నిజం చెప్పాలంటే గుండెదడకు సిసలైన కారణాల్ని చెప్పటం అంత తేలికేమీ కాదు. మామూలు రక్త పరీక్షల (Simple blood tests) ద్వారా డాక్టర్లు ఆ వ్యక్తికి అనీమియాగాని, గ్రాయిడ్ వ్యాధి గాని ఉందేమో తెలుసుకో ప్రయత్నిస్తారు. అదే ECG ద్వారా అయితే గుండె జబ్బు ఏమైనా ఉందేమో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.
ఇలా వచ్చి అలా నిష్క్రమించే గుండెదడ విషయంలో హోల్టర్ పరికరాన్ని పేషెంటుకు అమర్చి 24 గంటల పాటు గుండెదడ క్రమాన్ని పరీక్షిస్తారు.
గుండెదడ ఏ కారణం వల్ల వస్తోందో తెలుసుకోవటానికి కొన్ని సూచనలు:
• కాఫీ, టీలను మీరు రోజుకు 3,4, కప్పులకు మించి తాగుతుoటరా ,కోకో కోలా లాంటి శీతల పానీయాల్ని అధికంగా తాగుతున్నా వాటిలో ఉండే కెఫీన్ గుండెను ప్రేరేపించి గుండెదడకు కారణం కావచ్చు.
• కెఫీన్ లాగే సిగరెట్లులో ఉండే నికొటిన్ కూడా గుండెను ప్రేరేపించి గుండె దడను తెప్పిస్తుంది.
• తీవ్రమైన మానసిక వొత్తిడి లేక ఆందోళనలో ఉన్నప్పుడు రక్త ప్రవాహంలోకి అడ్రినలిన్ అధికంగా ప్రవహించి గుండెదడకు కారణమవుతుంది.
• రక్తహీనతకు సంబంధించిన అనీమియాలో రక్తం ఆక్సిజనును కణాలకు అందించే సామార్థ్యాన్ని కోల్పోయి ఉంటుంది. దానితో ఆ వ్యక్తి పాలిపోయి కనిపిస్తాడు. ఊపిరి అందక బాధ పడుతుంటాడు. ముఖ్యంగా ఏదన్నా శారీరక శ్రమ సందర్భంలో.
• అక్సిజను తక్కువగా ఉన్నా రక్తాన్ని గుండె శరీరానికి అవసరమైన మేర మరింతగాపంప్ చేయాల్సి రావటంతో గుండె వేగంగా కొట్టుకుని అతనికి గుండె దడగా అనిపిస్తుంది. ఈ పేషెంట్లు తర్వాత తర్వాత యాంజైనా (Angina) కి కూడా గురి అవుతారు.
• అనీమియాను సరి చేయగానే గుండె మళ్ళీ మామూలు స్థితికి వచ్చేస్తుంది.. ఎక్కువ కేసులలో అనీమియా ఐరన్ లోపం మూలంగా వస్తుంది. పాలిపోవటం, ఊపిరందక పోవటం, గుండె దడలకు 'బి' విటమన్ లోపం కారణం కావచ్చు.
• భారీగా భోజనం చేయడం ద్వారా కూడాను గుండె దడ వస్తుంది, ఇది సాధారణంగా జరిగేటువంటి పరిస్థితి.
• థైరాయిడ్ గ్రంధి అతిగా స్రవించినప్పుడు గుండె దడతో ఆకలి అధికం కావటం, బరువు తగ్గిపోవటం, చెమటలు పట్టటం మొదలైన లక్షణాలు ఉంటాయి.
• ఆస్తమాకి వాడే సాల్బుటమోల్, థియోఫిలైన్ లాంటి మందులు, నొప్పిని తగ్గించటానికి వాడే అనేక పెయిన్ కిల్లర్స్ మందులు, సన్నబడటానికి వాడే మందులు మొదలైనవి.
ఏ కారణమూ లేకుండానే గుండెదడ అకస్మాత్తుగా వస్తుందా ?
సాధారణంగా యువకులకు వచ్చే పరోక్సిస్మల్ టాచీకార్డియా లో ఇలా గుండెదడ అకస్మాత్తుగా వస్తుంది. కొద్దిపాటి ఎక్సర్సైజ్ చేయగానే తగ్గిపోతుంది. దానికదిగా తగ్గిపోయే ఈ గుండెదడకు ఏ గుండెజబ్బూ కారణం కాదు.
గుండెకు మిగతా ఏ కారణాలూ కనిపించకపోతే అది గుండె కవాటాలు పాడవటం కావచ్చు. లేక గుండె జబ్బుకు సంబంధించిన కారణం కావచ్చు. గుండెదడతో పాటు ఛాతీలో నొప్పి, ఊపిరి అందకపోవటం (ముఖ్యంగా పడుకుని ఉన్నప్పుడు), కళ్ళు బైర్లు కమ్మటం, బలహీనత, కాళ్ళూ చేతులు తిమ్మిరెక్కటం లాంటి లక్షణాలు కూడా ఉంటే గుండె జబ్బు కావచ్చునని డాక్టర్ని వెంటనే సంప్రదించి వారి యొక్క సూచనలు మరియు సలహాలు పాటించడం మంచిది.
గమనిక: పైన మేము తెలిపిన విషయాలన్నీ కూడాను గుండెదడకు సంబంధించి ప్రాథమిక అవగాహన మాత్రమే, ఇవే తుది నిర్ణయం కాదు, మేము అనుభవిజ్ఞులైన కొంతమంది వ్యక్తులు యొక్క సలహాలు మరియు సూచనలకు మేరకు మాత్రమే ఇక్కడ కొన్ని విషయాలు వివరించడం జరిగింది, మీకు గాని ఏదైనా గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెప్పినటువంటి విషయాలు మీకు ఒక ప్రాథమిక అంచనాగా తెలుసుకొని మీయొక్క డాక్టర్ని సంప్రదించి వారిచ్చేటువంటి సలహాలు మరి సూచనలు పాటించవలసిందిగా కోరుతున్నాము.