చంద్రబాబు గారు జైలుకి వెళ్లడం టిడిపికి కలిసొచ్చింది అంట.. ఇది ఎంతవరకు నిజం?

KV Health Tips
0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఇరుక్కుని సుమారుగా 50 రోజులు పైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు,  ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం టిడిపికి కలిసొచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు,

చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లడం,చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ, వార్తలు,చంద్రబాబు గారు జైలుకి వెళ్లడం టిడిపికి కలిసొచ్చింది అంట.. ఇది ఎంతవరకు నిజం?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఇరుక్కుని సుమారుగా 50 రోజులు పైన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు,  ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో ఇలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం టిడిపికి కలిసొచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు , కానీ ఇది ఎంతవరకు వాస్తవం మరియు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధ్యక్షున్ని అరెస్టు చేయటం వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు మేలు జరిగింది ? అన్ని విషయాలు కూడాను ఇక్కడ మనం తెలుసుకుందాం.

 నారా చంద్రబాబునాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు చేయడం జరిగింది, ఈ అరెస్టు కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో లేని సమయంలో ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది ఈ సమయంలో తెలుగుదేశం వారి ప్రధాన ఆరోపణ ఏమిటి అంటే మా నాయకుడిని కావాలనే అరెస్టు చేశారని రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు అని ఆ పార్టీ వారి ప్రధాన ఆరోపణ, కానీ అధికారపక్షమైనటువంటి వైయస్సార్ సిపి వారు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టే వారిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకానీ ఈ అరెస్టుతో మాకు గాని, మా పార్టీ వారికి గాని ఎటువంటి సంబంధం లేదు అని వారు చెబుతున్నారు.

ఈ అరెస్టు జరిగిన తర్వాత టిడిపి నాయకులు పెద్ద ఎత్తున రాష్ట్రంలో బందులు, ధర్నాలు చేశారు వీటివల్ల వారికి సానుభూతి పెరిగింది అని అలాగే వయసు మీద పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం వల్ల కూడాను ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగిందని ఆ పార్టీ వారు భావిస్తున్నారు, అరెస్టు కాబడినటువంటి చంద్రబాబు నాయుడు మీద ప్రజల్లో ఆయన మీద సానుభూతి పెరిగిందో లేదో తెలియదు కానీ, అరెస్టు సమయంలో టిడిపి వారు చేసినటువంటి ధర్నాలు రాస్తారోకుల వల్ల ప్రజల్లో మాత్రం వారు అనుకున్నంత స్పందన రాలేదు అని చెప్పుకోవచ్చు.

చంద్రబాబు నాయుడు గారి తనయుడైన నారా లోకేష్ కూడాను తన తండ్రి అరెస్టును అన్యాయంగా జరిగిందని మీడియా ముఖంగా దానిని వివరించాడే తప్ప ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన ఘోరంగానే విఫలమయ్యాడు, మొదట నుంచి ఆయన మీద ప్రజల్లో అంత విశ్వాసం లేదు, దీనికి ప్రధాన కారణం ఆయన ప్రజా వేదికలలో ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు సరైన అవగాహన లేకుండా తత్తర పాటుగా మాట్లాడటం మరియు పొంతన లేకుండా సమాధానం చెప్పడం వల్ల ఈయన మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత సదాప్రాయం లేదు. లోకేష్ గారి కంటే కూడాను ఈయన తల్లి అయినటువంటి భువనేశ్వరి గారు మరియు భార్య అయినటువంటి బ్రాహ్మణి గారు ప్రజల్లోకి యాక్టివ్ గా వెళ్లారు అని చెప్పుకోవచ్చు.

 తెలుగుదేశం ప్రభుత్వం వారు అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం వల్ల వారికి సానుభూతి పెరిగింది అని వచ్చే ఎలక్షన్లో మాకు అనుకూలంగా ఓట్లు వస్తాయని వారు భావించవచ్చు, కానీ వాస్తవానికి మొదటినుంచి కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతిపరుడు అని చెప్పి తెలుగుదేశం  పార్టీవారు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు  ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను నిర్దోషిని అని చెప్పి కోర్టులో నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే  ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని దోషిగా స్కిల్ స్కామ్ లో అరెస్టు చేయడం జరిగింది ఈ విధంగా అవినీతి మచ్చఆ పార్టీకి అంటుకుంది, ఈ కేసులో బలమైన సాక్షాలు ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు  గారు ఎంత ప్రయత్నించినా కానీ  బెయిల్ రావడం కుదరలేదు, కానీ ఈ మధ్యనే తనకు ఆరోగ్యం బాగా లేదని కండిషనల్ బెయిల్ మీద ఆయన బయటికి రావడం జరిగింది.

 ఇలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ వారికి ఈ అరెస్టు కలిసొస్తుందా లేదా చూడాలి, ప్రస్తుతానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల్లోకి నవరత్నాలు తీసుకువెళ్లడంలో చాలావరకు  సఫలీకృతం అయిందని చెప్పుకోవచ్చు మరియు ఈ  నవరత్నాల వలన ఎంతోకొంత ప్రజలకి మేలు జరిగిందని చెప్పుకోవచ్చు, ఇలాంటి సమయంలో టిడిపి వారి ఆలోచన సరైనదో లేదో ఇంకొన్ని నెలలు వేచి చూస్తే ప్రజలే తమ ఓటు హక్కు ద్వారా నిర్ణయిస్తారు.


Post a Comment

0Comments
Post a Comment (0)