పెళ్లయిన ఆడవారు పరాయి మగవారిని కోరుకోవడానికి గల కారణాలు మీకు తెలుసా ?

KV Health Tips
0

 ప్రపంచంలోనే అన్ని దేశాలు కూడాను మన భారతీయ వివాహ వ్యవస్థపై ఎంతో గౌరవాన్ని మర్యాదను చూపిస్తాయి దీనికి గల కారణం మన వివాహవస్థలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలే, కానీ ఈ మధ్యకాలంలో మన భారతీయ వివాహ వ్యవస్థ కూడాను ఆధునిక పోకడలకు పోయి వారి కుటుంబ వ్యవస్థను నాశనం చేసుకోవడమే కాకుండా ఎంతో అమూల్యమైన మన భారతీయ వివాహ వ్యవస్థను కూడా నాశనం చేస్తున్నారు, వీటిలో అది భయంకరమైన విషయం ఏమిటంటే పెళ్లయిన ఆడవారు కూడాను పరాయి మగవారి మోజులో పడి కట్టుకున్న భర్తను కన్న పిల్లల్ని కూడా వదిలి తమకు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు, ఒక ఇంట్లో  భార్య తప్పు చేసింది అంటే ఆ తప్పు   ఆమెది మాత్రమే కాదు ఆమె యొక్క భర్తది కూడా.

Reasons for married women to have relations with strange men,అక్రమ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, మెరుగైన సమాజం, సంసార జీవితం

అసలు పెళ్లి అయిన ఆడవారు పరాయి మగవారిని ఎందుకు కోరుకుంటారు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం వాటిలో ముఖ్యంగా కొన్ని విషయాలు ..

మొదటిగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆడవారు తప్పు చేస్తే దానికి ప్రధాన కారణం ఆమె యొక్క భర్త, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి మగవారు కూడాను వారికి ఆఫీసులో కానీ, బయటికాని ఎన్నో ఒత్తిడిలో బాధలో ఉండవచ్చు కానీ వారు ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం వాటన్నిటిని కూడాను బయటే విడిచిపెట్టి ఒక ఫ్రెష్ మైండ్ తో ఇంట్లోకి రావాలి అంతేకానీ వాటిని బుర్రలో ఉంచుకొని ఇంటికి వస్తే ఆ కోపం అంత కూడాను తన భార్య మీద చూపించడం జరుగుతుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరిగి ఆ పెరిగిన దూరంలోకి పరాయి మగవారు వచ్చే ప్రమాదం ఉంది, కావున మగవారికి ఎన్ని బాధలు ఉన్నా ఎంత ఒత్తిడిలో ఉన్నా కానీ వాటన్నిటిని కూడాను కుటుంబంలోనికి మాత్రం తీసుకొని రాకూడదు.

ఇలాగే మరొక విషయం ఏమిటంటే ప్రతి భర్త కూడాను తన భార్య యొక్క కోరికలను అర్థం చేసుకోవాలి ఎందుకంటే సాధారణంగా ఆడవారు కొన్ని విషయాలను తమ భర్తలతో పంచుకోవడానికి జంగుతూ ఉంటారు కాబట్టి మగవారే వారి ఇష్టాలను అర్థం చేసుకొని వారి మనసుకు తగినట్లుగా నడుచుకోవాలి అది పడక గదిలోని భార్యాభర్తల శృంగార విషయమైనా మరి ఏదైనా కానీ వారి మనసుని ఎరిగి నడుచుకోవాలి.

కొందరు ఆడవారు అయితే వారు తప్పు చేయడానికి ప్రధాన కారణం వారి యొక్క కుటుంబ పోషణ కావచ్చు ఎందుకంటే కుటుంబ పెద్దయినటువంటి మగవారు తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు లేదా ఆ కుటుంబం ఆ కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు గత్యంతరం లేక ఆ ఇంటిలోని ఆడవారే ఆ సంసారాన్ని నడపవలసి వచ్చినప్పుడు ఏ పని చేయాలో తెలియక ఇష్టం లేకపోయినా కొందరు ఆడవారు ఈ పని చేయవచ్చు కానీ ఇలా చేయడం ముమ్మాటికి చాలా తప్పు ఎందుకంటే వారి యొక్క పోషణకు ఇది ఒకటే మార్గం కాదు మనసుపెట్టి ఆలోచిస్తే ప్రస్తుత సమాజంలో ఎన్నో న్యాయమైన ఆదాయ మార్గాలు ఉన్నాయి వాటిలో మీకు ఇష్టమైనటువంటి దానిని ఎన్నుకొని ముందుకు వెళ్లవచ్చు, ఇలా కాకుండా  తప్పుడు మార్గంలోనే వెళ్లాలి అంటే మాత్రం అది మీ ఆరోగ్యానికి మరియు మీ కుటుంబానికి  ఎంతో హాని చేస్తుంది.

 కొంతమంది ఆడవారు మాత్రం వారికి కుటుంబంలో అన్ని వసతులు ఉన్న, వారి భర్త వారిని అమూల్యంగా చూసుకుంటున్న కానీ  వారు మాత్రం చెడు మార్గంలో  వెళ్లడానికే ఇష్టపడతారు, ఇలాంటివారు తమ కుటుంబం యొక్క  గౌరవం గురించి గానీ, తమ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి గానీ ఎటువంటి సందర్భంలో కూడాను ఆలోచించరు, వారి యొక్క సుఖం వారు చూసుకుంటారు, ఇలాంటి వారికి మనం ఏం చెప్పినా కానీ అర్థం చేసుకోరు.

ఏదేమైనా కానీ మన భారతీయ స్త్రీలకు ప్రపంచం మొత్తంలో కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, ఎందుకంటే పాశ్చాత్య దేశాల ఆడవారితో పోల్చుకుంటే మన భారతీయ స్రీలు వివాహ వ్యవస్థకు మరియు కట్టుకున్న భర్తకు ఎంతో విలువ ఇస్తారు, కాబట్టి ఆ విలువను భవిష్యత్తులో కూడాను కొనసాగించాలని కోరుకుందాం.


పైన మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను ఉదాహరణగా తీసుకొని వాటిలో కొన్ని మాత్రమే మీకు వివరించడం జరిగింది, అంతేకానీ ఏ ఒక్కరిని గాని కించపరచడం మా యొక్క ఉద్దేశం కాదు, మెరుగైన సమాజాన్ని చూడటమే మా యొక్క ఉద్దేశం అలా చూడాలి అంటే మన యొక్క ఆలోచనలు అలాగే మన కుటుంబ వ్యవస్థ కూడాను పద్ధతిగా ఉండాలి అప్పుడే మనం ఆదర్శమైన, ఎంతో ఉన్నతమైన సమాజాన్ని చూడగలుగుతాం, కావున ఎవరు కూడా అన్యధా భావించవద్దని మా యొక్క మనవి.

Post a Comment

0Comments
Post a Comment (0)