గ్రేడ్-2 మున్సిపాలిటీగా పెనుకొండ

పెనుకొండ, జూలై 18 (మీకోసం న్యూస్): పెనుకొండ నగర పంచాయతీ గ్రేడ్-2 మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవితమ్మను మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెనుకొండ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మున్సిపల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

అనంతరం నగర పంచాయతీలో పనిచేస్తూ వివిధ కారణాలతో మృతి చెందిన కార్మికులు ఓబులేష్, రాము, నరసింహులు, ముత్యాలప్ప కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం అందించిన సహాయానికి మృతుల కుటుంబ సభ్యులు మంత్రి సవితమ్మకు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీకోసం న్యూస్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు