లేపాక్షి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ సర్కిల్ పరిధిలోని లేపాక్షి పోలీస్ స్టేషన్ పరిధిలో తిలక్‌నగర్ శివారు ప్రాంతంలో ప్రత్యేక డ్రోన్ నిఘా నిర్వహిస్తున్నట్లు హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు చేపట్టిన ఈ నిఘా ద్వారా ప్రజల భద్రతను మరింత పటిష్టం చేయడం, శాంతిభద్రతలను కాపాడడం, అనుమానాస్పద వ్యక్తులు మరియు అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం, అవాంఛనీయ సంఘటనలను నివారించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసులు ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా అత్యవసర సేవల నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల అప్రమత్తత, పోలీసుల నిఘా సమాజ భద్రతకు బలమైన పునాదిగా నిలుస్తుందని సీఐ జనార్ధన్ తెలిపారు.
-మీకోసం న్యూస్
0 కామెంట్‌లు