నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్

 

జూలై 31 వరకు దరఖాస్తులకు అవకాశం

నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం జవహర్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ (JNVST–2027) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు ఈ నెల జూలై 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షను నవంబర్ 28, 2026న నిర్వహించనున్నారు.

ప్రస్తుతం 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి పూర్తిగా ఉచిత విద్యతో పాటు హాస్టల్, భోజనం, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. సీబీఎస్‌ఈ విధానంలో నాణ్యమైన విద్య అందించబడుతుంది.

అర్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, సిలబస్, రిజర్వేషన్లు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలని నవోదయ విద్యాలయ సమితి సూచించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు