ఎంఆర్వో మారుతి సుడిగాలి పర్యటన

 మీకోసం న్యూస్ | సోమందేపల్లి జూలై 06 



పలు పోలింగ్ బూత్‌ల పరిశీలన.. SIR కార్యక్రమంపై అధికారులతో సమీక్ష

సోమందేపల్లి, జూలై 6: మండల తహసీల్దార్ మారుతి సోమందేపల్లి మండలంలోని పలు పోలింగ్ బూత్‌లను సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులతో (BLOలు) మాట్లాడిన తహసీల్దార్, SIR కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లకు అందుబాటులో ఉంటూ, వారికి SIR ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరి వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసి, ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు స్పష్టం చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు