కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

 మీకోసం న్యూస్ I చిలమత్తూరు 


చిలమత్తూరు, జూలై 5 (మీకోసం న్యూస్): చిలమత్తూరు మండల పరిధిలోని కొడికొండ చెక్‌పోస్ట్ సమీపంలోని రాజధాని డాబా వద్ద ఈ రోజు సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికుల సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని 108 అంబులెన్స్‌లో హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన ఇద్దరూ సోమందేపల్లి మండలానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. అయితే, మృతుడు, గాయపడిన వ్యక్తి వివరాలు అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు